Superstar Krishna : రేపు మహాప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయానికి అంత్యక్రియలు.!
NQ Staff - November 15, 2022 / 02:21 PM IST

Superstar Krishna : ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంతో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన విషయం విదితమే. ఈ రోజు తెల్లవారు ఝామున నాలుగు గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడిచినట్లు ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.
సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయాన్ని నానాక్రామ్గూడాలోని ఆయన ఇంటికి తరలించారు. అక్కడే ప్రముఖుల సందర్శనార్ధం భౌతిక కాయాన్ని వుంచారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించి ఘన నివాళి అర్పిస్తున్నారు. తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో వున్న మహేష్‌బాబుని ఓదార్చుతున్నారు.
రేపు అంత్యక్రియులు..
చిరంజీవి, వెంకటేష్, పవన్ కళ్యాణ్, ఎన్టీయార్, అల్లు అర్జున్, నాగచైతన్య తదితర సినీ ప్రముఖులతోపాటు తెలంగాణ మంత్రి కేటీయార్, టీడీపీ అధినేత చంద్రబాబు తదితర రాజకీయ ప్రముఖులు, కృష్ణ పార్థీవ దేహానికి నివాళులర్పించారు.
అభిమానుల సందర్శనార్ధం కృష్ణ భౌతిక కాయాన్ని గచ్చిబౌలికి సాయంత్రి ఐదు గంటల సమయంలో తరలిస్తారు. రేపు (బుధవారం) కృష్ణ భౌతిక కాయానికి అంత్యక్రియల్ని మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు.
కాగా, నానక్ రామ్ గూడాలోని సూపర్ స్టార్ కృష్ణ ఇంటికి పెద్దయెత్తున అభిమానులు చేరుకుంటున్నారు.