Rajinikanth: దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకున్న ర‌జ‌నీకాంత్‌.. దేశం గ‌ర్వించే స‌మయం అంటూ ట్వీట్

Rajinikanth సూపర్ స్టార్ రజినీకాంత్ దాదాపు నాలుగు దశాబ్ధాలకు పైగా సినీ రంగంలో నటనతో ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు కేవలం హీరోగానే కాకుండా.. దర్శకుడిగా.. నిర్మాతగా సినీ పరిశ్రమలో రజినీ నిజంగానే సూపర్ స్టార్. సినీ కళామతల్లికి రజినీ అందిస్తున్న విశేష సేవలకుగానూ కేంద్రం అత్యున్నత దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించింది.

TheNewsQube-

నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ పరిశ్రమకు చేస్తున్న విశేష సేవలకు గాను కేంద్రప్రభుత్వం ఆయన్ని ఈ పురస్కారంతో సత్కరించింది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు.ఇదే అవార్డుల ప్రధానోత్సవంలో హీరో ధనుష్‌ అసురన్‌ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు. దీంతో ఒకే ఏడాదిలో రజనీకాంత్‌, ఆయన అల్లుడు ధనుష్‌ అవార్డులు అందుకోవడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ అవార్డ్ వేడుక‌ల‌లో బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌గా మలయాళం నుంచి ‘మరక్కర్‌’ నిలవగా, ‘భోంస్లే’ చిత్రానికి మనోజ్‌ బాజ్‌పాయీ, ‘అసురన్’ చిత్రానికి ధనుష్‌ ఉత్తమ నటులుగా అవార్డులను సొంతం చేసుకున్నారు. ‘మణికర్ణిక’ చిత్రానికి కంగనా రనౌత్‌ ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకున్నారు. మరోవైపు, తెలుగులో ‘జెర్సీ’, ‘మహర్షి’ చిత్రాలకు నాలుగు విభాగాల్లో అవార్డులు లభించాయి.

ఈరోజు రజినీ జీవితంలో చాలా స్పెషల్.. ఒకటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్ట్ రావడం..మరొకటి.. రజినీ కూతురు సౌందర్య విశాగన్ తను సొంతంగా రూపొందించిన Hoote యాప్ ప్రారంభించబోతుంది. ఇందులో ప్రజలు వారి వాయిస్ ద్వారా ఆలోచనలను పంచుకోవచ్చు. అయితే ముందుగా ఈ యాప్ రజినీ వాయిస్‏తో ప్రారంభిస్తున్నారు. అందుకే ఈ ఈరోజు రజినీ జీవితంలో చాలా ప్రత్యేకం.

తాను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకుంటున్న స‌మ‌యంలో తన గురువు కె.బాలచందర్‌ లేకపోవడం ఎంతో బాధగా ఉందన్నారు. ‘‘దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు రావడం నాకెంతో ఆనందంగా ఉంది. ఇంత గొప్ప అవార్డు రావడం సినీ ప్రేక్షకులు, తమిళ ప్రజల ఆదరాభిమానాల వల్లే సాధ్యమైంది అని అన్నారు త‌లైవా.