సూపర్ స్టార్ రజినీకాంత్ కు తీవ్ర అస్వస్థత. అపోలో హాస్పిటల్ లో చేరిక !
Admin - January 6, 2021 / 03:29 PM IST

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. అయితే హైబీపీ కారణంగా ఆయనను హైదరాబాద్ లోని అపోలో హాస్పటల్ లో చేర్చారు. ప్రస్తుతం వైద్యుల అధీనంలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుంది. ఇక రజినీకాంత్ వెంట హాస్పిటల్ లో తన కూతురు ఐశ్వర్య ఉన్నట్లు సమాచారం వస్తుంది. అలాగే రజినీకాంత్ కు కరోనా టెస్టు కూడా చేశారట. ఇక ఈ టెస్టులో కరోనా నెగిటివ్ గా తేలిందని తెలుస్తుంది. ఇక ఆయన ఆరోగ్యం గురించి మరింత సమాచారం త్వరలో వెల్లడించనున్నారు.
కాగా.. హీరో రజినీకాంత్ నటిస్తున్న ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో నడుస్తుంది. ఇక సన్ పిక్చర్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే రెండు రోజుల క్రితం చిత్ర ప్రొడక్షన్ లో ఎనమిది మంది సబ్యులకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీనితో చిత్ర షూటింగ్ ను నిలిపివేశారు. ఇక ఈ ఇదే తరుణంలో రజినీకాంత్ అస్వస్థత గురవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకవైపు రజినీకాంత్ ఆరోగ్యంపై ఆయన సన్నిహితులు, అభిమానులు ఆందోళనలో ఉన్నారు.