Super Machi Review: సూప‌ర్ మ‌చ్చి రివ్యూ

Super Machi Review: చిరంజీవి అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ విజేత చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌గా, ఇప్పుడు రెండో చిత్రంగా సూప‌ర్ మ‌చ్చి అనే సినిమా చేశాడు. ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ యంగ్ హీరో.. లుక్స్, ఫిజిక్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్‌ కూడా సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేశాయి. ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సూపర్‌ మచ్చి’సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

Super Machi Review
Super Machi Review

కథః

రాజు(కళ్యాణ్‌ దేవ్‌) ఎలాంటి బరువు బాధ్యతులు లేని జల్సారాయుడు. ఇన్ఫోసిస్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసే మీనాక్షి (రచిత రామ్).. బార్‌లో పాటలు పాడుతూ.. ఆవారాగా తిరిగే (రాజు)ని అమితంగా ప్రేమిస్తుంది. మీనాక్షి అంటే రాజుకి ఇష్టం లేదు. దీంతో ఆమె తిరస్కరిస్తాడు. మీనాక్షి వెంటపడుతుంటే తట్టుకోలేక ఓ రోజు తనతో గడిపితే పెళ్లి చేసుకుంటానని అంటాడు రాజు. రాజు అంటే మీనాక్షి ఎందుకంత ఇష్టం. మీనాక్షి ఇష్టం ఉన్నా లేనట్టుగా రాజు ఎందుకు నటిస్తున్నాడు? ప్రాణం కన్న మిన్నగా ప్రేమించిన మీనాక్షిని రాజు ఎందుకు దూరంగా పెట్టాడు? మీనాక్షిని చూడకుండా ప్రేమించిదెవరు? మీనాక్షి తండ్రి(రాజేంద్రప్రసాద్‌) చివరి కోరిక ఏంటి? ఇవి చిత్రం చూస్తే తెలుస్తుంది.

న‌టీన‌టుల ప‌ర్‌ఫార్మెన్స్:

జులాయిగా , చూడని ప్రియురాలి కోసం తపన పడే ప్రేమికుడు రాజు పాత్రలో కల్యాణ్ దేవ్ మంచి నటనను కనబరిచాడు. డ్యాన్స్‌తో పాటు ఫైట్స్‌ సీన్స్‌లో కూడా అద్భుతంగా నటించారు. ఇక మీనాక్షిగా రచిత రామ్ యాక్టింగ్‌ చాలా బాగుంది. సినిమా భారాన్ని మొత్తం భుజాన వేసుకొని నడిపించింది. సెకండాఫ్‌లోఎమోష‌న్స్‌ని బాగా పండించింది. హీరో తల్లిదండ్రులుగా నరేశ్‌, ప్రగతి మరోసారి తెరపై తమ అనుభవాన్ని చూపించారు. మీనాక్షి తండ్రి పాత్రలో రాజేంద్రప్రసాద్‌ ఒదిగిపోయారు. పొసాని కృష్ణమురళి, మహేష్ ఆచంట, భద్రంతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

Super Machi Review
Super Machi Review

టెక్నిక‌ల్ ప‌ర్‌ఫార్మెన్స్:

చూడకుండా ప్రేమించుకోవడం ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌లో కథను ముందుకు నడిపాడు దర్శకుడు పులి వాసు. ఆయ‌న‌ ఎంచుకొన్న పాయింట్‌ బాగున్నప్పటీకీ.. తెరపై చూపించడంలో కాస్త తడపడ్డాడు. ఫస్టాఫ్‌ అంతా చాలా ఇంట్రెస్టింగ్‌గా నడిపించాడు. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ కూడా సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. త‌ర్వాత అంత‌గా న‌డిపించ‌లేక‌పోయాడు. తమన్‌ సంగీతం బాగుంది. పాటలు అంతంత మాత్రమే అయినప్పటికీ.. నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటర్‌ మార్తాండ్‌ వెంకటేష్‌ సెకండాఫ్‌లోని కొన్ని సీన్స్‌ని ఇంకాస్త క్రిస్పీగా కట్‌ చేస్తే మరింత బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

Super Machi Review
Super Machi Review

ప్ల‌స్ పాయింట్స్

  • క‌ళ్యాణ్ దేవ్, ర‌చిత న‌ట‌న‌
  • సెకండాఫ్ ఎమోష‌న్స్
  • త‌మ‌న్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్

మైన‌స్ పాయింట్స్

  • ఎడిటింగ్
  • రొటీన్ స్టోరీ

విశ్లేషణః

లవ్‌, రొమాన్స్, ఎమోషన్స్ మేళవించిన చిత్రమిది. రాజు, మీనాక్షిల వన్‌సైడ్‌ లవ్‌ ట్రాక్‌తో సినిమా సాగుతుంది. సరదా సరదాగా రన్‌ అవుతుంటుంది. మరణానికి ముందు తండ్రి కోరిన కోరిక కోసం ప్రాణంగా ప్రేమించే యువకుడిని ప్రేమను త్యాగం చేసి రాజు కోసం సర్వం అర్పించడానికి సిద్దమైందనే పాయింట్ అందరిని కదిలిస్తుంది. మొత్తంగా ఓ డిఫరెంట్‌ ఎక్స్ పీరియెన్స్ ని ఇస్తుంది. పండ‌గ రోజు మంచి టైమ్ పాస్ మూవీగా దీనిని చూడొచ్చు.

రేటింగ్: 2/5