Dhanush : సూపర్ హిట్ సినిమా సీక్వెల్ కి సర్వం సిద్దం.. కానీ హీరోనే మారిపోయాడు..!

Vedha - April 5, 2021 / 06:00 PM IST

Dhanush : సూపర్ హిట్ సినిమా సీక్వెల్ కి సర్వం సిద్దం.. కానీ హీరోనే మారిపోయాడు..!

Dhanush : కోలీవుడ్ లో కార్తి కి ఉన్న క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. గత ఏడాది ఖైదీ సినిమాతో వచ్చి సెన్షేషనల్ హిట్ అందుకున్న కార్తి తాజాగా సుల్తాన్ సినిమాతో వచ్చాడు. రష్మిక మందన్న తమిళంలో నటించిన మొదటి సినిమా కావడం విశేషం. ఇక ఈ సినిమాతో కార్తి పాన్ ఇండియన్ స్టార్ గా మారాడు. తెలుగు డబ్బింగ్ వర్షన్ ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా తమిళంలో మాత్రం మంచి వసూళ్ళు సాధించిందని సమాచారం. మంచి జోష్ మీద కార్తి నెక్స్ట్ సినిమాకి ప్లాన్ చేసుకుంటున్నాడు.

super-hit-movie-sequal-but-hero-is-changed

super-hit-movie-sequal-but-hero-is-changed

కాగా గతంలో తను నటించిన ఒక సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ తెరకెక్కించడానికి రంగం సిద్దంవుతోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సెల్వరాఘవన్ తను తెరకెక్కించిన ‘యుగానికి ఒక్కడు’ సినిమా సీక్వెల్‌ని రూపొందించబోతున్నాడు. అప్పట్లో యుగానికి ఒక్కడు సినిమా అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో కార్తి ఇమేజ్ కూడా డబుల్ అయిందని చెప్పాలి. యుగానికి ఒక్కడులో చోళులు పాండ్యులకు సంబంధించిన ఆసక్తికరమైన ఎపిసోడ్స్ ఒక అనుభూతిని కలుగ చేసింది.

Dhanush : ఈ సినిమాను 2024లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

దాంతో అప్పట్లోనే ఈ సినిమా సీక్వెల్ ప్లాన్ చేశారు. కానీ ఎందుకనో ప్రాజెక్ట్ సెట్ కాలేదు. కాగా ఇప్పుడు సెట్స్ మీదకి రాబోతుండగా హీరో మాత్రం కార్తి కాదట. ధనుష్ ఈ సినిమా సీక్వెల్ లో నటించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. చోళరాజుల నేపథ్యంలో సాగే కథను మరోసారి తెరమీద ఆవిష్కరించబోతున్నాడు సెల్వ రాఘవన్. ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కానుందని టాక్. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ వర్క్ మొదలైందని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాను 2024లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us