Siri: సిరి ష‌ర్ట్ లోప‌ల స‌న్నీ నిజంగా చేతులు పెట్టాడా.. అన్‌సీన్ వీడియోలో ఏముంది..!

Siri: బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న బిగ్ బాస్ కార్య‌క్ర‌మం రోజు రోజుకి ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. కంటెస్టెంట్స్ మ‌ధ్య వాడి వేడి చ‌ర్చ నడుస్తుంది. నామినేషన్‌ కోసం రెండు టీమ్స్‌గా విడిపోయిన ఇంటి సభ్యులు.. ఇప్పుడు అదే టీమ్‌తో కెప్టెన్సీ కంటెండర్‌ టాస్క్‌ ఆడాలని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. దీనికి ‘పంథం నీదా నాదా’అనే టైటిల్‌ని పెట్టాడు.

Sunny Put Hand inside Siri Shirt
Sunny Put Hand inside Siri Shirt

రెండు టీమ్స్‌ ఈ వారం వివిధ టాస్క్‌ల్లో పోటీ పడాల్సి వస్తుంది. తొలుత ‘దొంగలున్నారు జాగ్రత్త’అనే టాస్క్‌ని ఇచ్చాడు. ఇందులో భాగంగా యాక్టివిటీ ఏరియాలో రెండు టీమ్స్‌కి సంబంధించిన డగౌట్స్‌ ఉంటాయి. నక్క టీమ్‌( ఉమాదేవి, లహరి, రవి, జెస్సీ, మానస్‌, సన్నీ, కాజల్‌, శ్వేత, నటరాజ్‌)కు సంబంధించిన డగౌట్స్‌లో గద్ద టీమ్‌( లోబో, యానీ మాస్టర్‌, శ్రీరామ్‌, ప్రియ, హమీదా, విశ్వ, సిరి, షణ్ముఖ్‌, ప్రియాంక)కు చెందిన బ్యాటెన్స్‌(పిల్లోస్‌) ఉంటాయి. గద్ద టీమ్‌ డగౌట్స్‌లో నక్కటీమ్‌కు చెందిన పిల్లోస్‌ ఉంటాయి.

ప్రతి టీమ్‌ ఇతర టీమ్‌లోని డగౌట్స్‌లో ఉన్న పిల్లోస్‌ని తెచ్చుకొని తన డగౌట్స్‌లో పెట్టుకోవాలి. అలాగే ఇతర టీమ్‌లోని పిల్లోస్‌ని వారికి దొరకుండా చూసుకోవాలి. ఇలా మొత్తం టాస్క్‌ పూర్తయ్యే వరకు ఏ టీమ్‌లో ఎక్కువగా పిల్లోస్‌ ఉంటాయో అవే ఫ్లాగ్స్‌గా లెక్కించబడతాయి. పిల్లోస్ లాక్కునే క్రమంలో సిరి షర్ట్‌లో సన్నీ చేయి పెట్టాడని.. సిరి చాలా పెద్ద గొడవ చేసింది. స‌న్నీ మాత్రం తాను అలా చేయ‌లేద‌ని చెప్పాడు.

పిల్లోను తీసుకోవాల‌ని భావించి సిరిని ప‌ట్టుకున్నాడు…లోప‌ల ఉన్న పిల్లోను తీయ‌డం కోసం మ‌రో లేడీ కంటెస్టెంట్ అయిన శ్వేత‌ను పిలిచాడు… సిరికి స‌పోర్ట్ గా ష‌న్ను వ‌చ్చాడు. శ్వేత పిల్లోను కాస్త బ‌య‌టికి లాగ‌గా …ష‌న్ను దాన్ని తీసుకుపోయాడు. ఈ ఇన్సిడెంట్ త‌ర్వాత సిరీ స‌న్నీని టార్గెట్ చేస్తూ త‌న టీ ష‌ర్ట్ లో చెయ్యి పెట్టాడ‌ని ఆరోపించింది.

సీన్‌ని స్లో మోష‌న్ లో చూస్తే అత‌ను కేవ‌లం చేతుల‌ను వెన‌క్కి ప‌ట్టుకున్నాడే కానీ టీష‌ర్ట్ లో చెయ్యి పెట్ట‌లేదు అని అర్ధ‌మైంది. కావాల‌నే సిరి అత‌డిపై ఆరోప‌ణ‌లు చేసింద‌ని నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు.