Sunny Leone: సన్నీ లియోన్ తో ఒక బటన్ నొక్కించుకోవడానికి అయిన ఖర్చు 16 లక్షలు..!?

Sunny Leone: పోర్న్ స్టార్ ఇమేజ్‌ని ప‌క్క‌కు పెట్టి ప్ర‌స్తుతం బాలీవుడ్ న‌టిగా మంచి ఆద‌ర‌ణ ద‌క్కించుకున్న హాట్ గార్ల్ స‌న్నీ లియోన్‌. టాలీవుడ్ నుండి హాలీవుడ్ వ‌ర‌కు స‌న్నీ లియోన్‌కు భీబ‌త్స‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మ‌డు సినిమా చేసిన‌, స్పెష‌ల్ డ్యాన్స్‌లో న‌ర్తించిన లేదంటే ఆమె చేతుల మీదుగా ఏదైన విడుద‌లైన కూడా అతి త‌క్కువ స‌మ‌యంలోనే ఫుల్ వైర‌ల్ అవుతూ ఉంటుంది.

సన్నీ త‌న క్రేజ్‌ని క్యాష్ చేసుకొని ప్ర‌మోష‌న్స్ లేదంటే సినిమాల‌లో నటించినా భారీగానే వ‌సూలు చేస్తుంది. తాజాగా ఈమె తెలుగులో విడుదల చేసిన ఓ టీజర్ యూ ట్యూబ్‌లో బాగానే ట్రెండ్ అవుతుంది. శ్రీ పిక్చర్స్ బ్యానర్ పై గీతానంద్, మిత్ర శర్మ ప్రధాన పాత్రల్లో దయానంద్ తెరకెక్కిస్తున్న సినిమా బాయ్స్. ఈ మధ్యే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన రాజా హే రాజా అనే యూత్ ఫుల్ కాలేజ్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటను శ్రీమణి రచించారు. స్మరన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను పాడారు. లేడీ ప్రొడ్యూసర్ మిత్ర శర్మ బాయ్స్ సినిమాను నిర్మిస్తున్నారు. ఒకవైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు నిర్మాణ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు మిత్ర శర్మ.

జూలై 16 సాయంత్రం 5 గంటలకు బాయ్స్ చిత్ర టీజర్‌ని స‌న్నీలియోన్ చేతుల మీదుగా విడుద‌ల చేయించారు. నారప్ప, ట్రిపుల్ ఆర్ లాంటి సినిమాలతో పోటీ పడుతూ యూ ట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతుంది ఈ టీజర్. రెండు రోజుల కింద విడుదలైన ఈ టీజర్ ప్రస్తుతం యూ ట్యూబ్ నెంబర్ 3 ట్రెండింగ్‌లో ఉంది. అయితే టీజ‌ర్ రిలీజ్ చేసే క్ర‌మంలో స‌న్నీ లియోన్ ల్యాప్ టాప్‌లో బ‌ట‌న్ ప్రెస్ చేసిందుకు 12 ల‌క్ష‌ల రూపాయ‌లు ఛార్జ్ చేసింది. ఇక టీం ముంబైకి వెళ్లి అక్క‌డ ఆమెతో టీజ‌ర్ విడుద‌ల చేయించి తిరిగి హైదరాబాద్‌కు రావ‌డానికి మ‌రో 4 ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చు అయింది. మొత్తాన్ని స‌న్నీతో ఒక బ‌ట‌న్ నొక్కించ‌డానికి బాయ్స్ చిత్ర బృందం16 ల‌క్షలు ఖ‌ర్చు చేసింది.

ఈ సినిమాకు వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తుండ‌గా, మార్తాండ్.కె.వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. బెక్కం రవీందర్, కొండపతురి ప్రసాద్ ప్రొడక్షన్ మేనేజర్లుగా పని చేస్తున్నారు.