సర్‌ప్రైజింగ్ లుక్‌లో సన్నీలియోన్..అమ్మడి అవతారాన్ని చూసి ఉలిక్కిపడ్డ ఫ్యాన్స్
Samsthi 2210 - November 2, 2020 / 08:58 PM IST

పోర్న్ స్టార్ నుండి బాలీవుడ్ స్టార్‌గా ఎదిగిన సన్నీ లియోన్ అనతి కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందింది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో సన్నీ లియోన్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఓ సారి సౌత్ రాష్ట్రంలోని షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు సన్నీ లియోన్ హాజరుకాగా ఆమెను చూసేందుకు జనాలు తండోపతండాలుగా అక్కడికి వచ్చారు. దీంతో ఆ ప్రాంతం జనసంద్రంగా మారింది. ఇలాంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. కరోనా వలన ప్రస్తుతం తన భర్త, ఫ్యామిలీతో కలిస లాస్ ఏంజెల్స్‌లో ఉన్న సన్నీ లియోన్ హాలోవీన్ పండుగను తన స్టైల్‌లో జరుపుకుంది.
స్పూకీయెస్ట్ పండుగ గా చెప్పుకునే హాలోవీన్ అతి తక్కువ టైంలో చాలా ప్రాముఖ్యతని పొందింది. పశ్చిమ దేశాలలో ప్రధానంగా జరుపుకునే పండుగని భారతీయులు కూడా ఓన్ చేసుకొని సరదాగా జరుపుకుంటున్నారు. మన తెలుగు వారు కూడా ఇందుకు అతీతులేమి కాదు. మంచు లక్ష్మీ, అల్లు అర్జున్ వంటి సెలబ్రిటీలు తమ పిల్లలని దెయ్యాలు, రాక్షసులిగా మార్చి హాలోవీన్‌ను జరుపుకున్నారు. జాంబీస్.. మంత్రగత్తెలు .. భూత ప్రేతాల్ని తలపించే డ్రెస్సింగ్ లలో కొందరు నెటిజన్స్ కనిపించి అందరికి షాక్ ఇచ్చారు.
బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్ హాలోవీన్ లో భాగంగా రంగు రంగుల దుస్తులలో మెరిసి అందరికి షాక్ ఇచ్చింది. సన్నీ లియోన్ తో పాటు డేనియల్ వెబెర్ వారి పిల్లలు నిషా కౌర్ వెబెర్… అషర్ సింగ్ వెబెర్ .. నోహ్ సింగ్ వెబెర్ల కూడా వెరైటీ దుస్తులలో మెరిసి అందరిని ఆశ్చర్యపరిచారు. వీరి ఫోటోలు అంతర్జాలంలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. కాగా సన్నీ లియోన్ ..16 జూలై 2017 న నిషా కౌర్ వెబెర్ అనే 21 నెలల ఆడ శిశువును దత్తత తీసుకోగా, ఏడాది తర్వాత సరోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చింది .ప్రస్తుతం ఫ్యామిలీతో ఆనంద క్షణాలు గడుపుతుంది.