SUNITHA: మాల్దీవుల్లో మాస్త్ ఎంజాయ్ చేస్తున్న సునీత‌.. ఫొటోలు వైర‌ల్

Samsthi 2210 - February 15, 2021 / 11:18 AM IST

SUNITHA: మాల్దీవుల్లో మాస్త్ ఎంజాయ్ చేస్తున్న సునీత‌.. ఫొటోలు వైర‌ల్

SUNITHA ప్ర‌ముఖ నేప‌ద్య గాయ‌కురాలు , డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ సునీత గ‌త కొద్ది రోజులుగా నిత్యం వార్త‌ల‌లో నిలుస్తూనే ఉంది. రెండో పెళ్లి వ‌ద్దు మొర్రో అన్న సునీత స‌డెన్‌గా తాను రెండో పెళ్లికి సిద్ధ‌మైన‌ట్టు ప్ర‌క‌టించి హాట్ టాపిక్‌గా మారింది. జ‌న‌వ‌రి 9న మ్యాంగో మీడియా అధినేత రామ్‌ వీరపనేనిని హైద‌రాబాద్‌లోని పురాత‌న టెంపుల్‌లో వివాహం చేసుకుంది. క‌రోనా వ‌ల‌న కొద్ది మంది స్నేహితులు, బంధువులు, ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. సునీత పెళ్లికి సంబంధించిన ప‌లు ఫొటోలు సోష‌ల్ మీడియాని షేక్ చేశాయి. అయితే సునీతకు రామ్ వీర‌ప‌నేనికి ఎక్క‌డ ప‌రిచ‌యం అయింది, వీరిద్ద‌రు పెళ్ళి చేసుకోవాల‌ని ఎందుకు అనుకున్నార‌ని చాలా మంది ఆలోచించారు.ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో వీటికి సునీత క్లారిటీ ఒచ్చింది.

ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్న సింగర్.. ఇటు సినిమాల్లో కూడా మళ్లీ బిజీ అయిపోయారు. ప‌లు సినిమ ఆఫ‌ర్స్ సునీత‌కు వ‌స్తున్న‌ట్టు తెలుస్తుంది. అయితే రీసెంట్‌గా సుమ‌తో ఓ ఇంట‌ర్వ్యూ ఇచ్చిన సునీత నాకు పెళ్లి ఉద్దేశ‌మే లేదు, కాని లాక్‌డౌన్ లో ఏద జ‌రిగింద‌ని, మా పెళ్లి జ‌ర‌గ‌డానికి క‌రోనా రావ‌ల్సి వ‌చ్చింద‌ని సునీత చెప్పుకొచ్చింది. ఓ రోజు వృత్తిపరంగానే రామ్ నాకు ఫోన్ కాల్ చేశారు. నీతో సీరియస్‌గా మాట్లాడాలని అన్నారు. నేను ఎప్పటి నుంచో ప్రపోజ్ చేస్తున్న విషయం తెలియదా? అని అన్నాడు. అలా మాట్లాడాక కారులో డ్రైవ్‌కు వెళ్లాం. అక్కడ అన్నీ మాట్లాడుకొని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. కుటుంబ స‌భ్యుల ప్రోత్సాహంతో పెళ్లైపోయింద‌ని చెప్పుకొచ్చింది సునీత‌.

ప్ర‌స్తుతం త‌మ జీవితం బాగుంద‌ని చెప్పిన సునీత కొద్ది రోజులు ప్ర‌శాంత‌మైన జీవితం గ‌డిపేందుకు మాల్దీవుల‌కు చెక్కేసింది. భ‌ర్త‌తో క‌లిసి మాల్దీవుల‌కు వెళ్లిన సునీత అక్క‌డ అంద‌మైన ప్ర‌కృతితో పాటు త‌న ఫొటో ఒక‌టి షేర్ చేసింది. ఇందులో హ్యాట్ పెట్టుకొని చాలా స్టైలిష్‌గా క‌నిపిస్తున్న సునీత‌ను చూసి అభిమానులు మురిసిపోతున్నారు. మీ కాపురం ప‌ది కాలాల పాటు చ‌ల్ల‌గా ఉండాల‌ని కామెంట్స్ పెడుతున్నారు.అయితే జీవితం చాలా చిన్నదని.. ఉన్నన్ని రోజులు సంతోషంగా గడపాలన్నదే తమ అభిమతని సింగర్ సునీత్, రామ్ భావిస్తుండ‌డం విశేషం.

 

View this post on Instagram

 

A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha)

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us