Sunitha: సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా అశేష ప్రేక్షకాదరణ పొందిన సునీత ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. సుస్వర గానంతో శ్రోతలని అలరించిన సునీత కొద్ది రోజుల క్రితం వ్యాపారవేత్త రామ్ సూరపనేనిని ఇటీవల ఈమె పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. తనకు సంబంధించిన ఏ చిన్న విషయాన్ని అయినా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.


గత 26 ఏళ్లుగా తన పాటతో అలరిస్తున్న సునీత పాటకు మాటకు అనేకమంది ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా సునీత తన ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ఒక వీడియో పంచుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ చిన్నారి కనిపిస్తోంది. అయితే ఆ చిన్నారి సునీత పాటను తన్మయత్వంతో వింటోంది. ఈ వీడియో షేర్ చేస్తూ.. చిన్న పిల్లలు కూడా నా పాటను వింటూ ఆనందిస్తున్నారని సునీత సంతోషం వ్యక్తం చేసింది.
“ఆహా ఏమి ఈ భాగ్యం. నాకు ఈ అదృష్టం ఇచ్చిన దేవుడికి నా ధన్యవాదాలు” అని కాప్షన్ తో చిన్నారి వీడియో చేసింది, మరి అంతగా సునీతను, నెటిజన్లను ఆకట్టుకున్న ఆ వీడియోలో ఏముందంటే.. సునీత పాడిన తెలుసా మనసా సాంగ్. ఈ పాట నాగార్జున నటించిన క్రిమినల్ మూవీలోని సూపర్ హిట్ సాంగ్. ‘తెలుసా మనసా’ .. సినిమాలో ఈ పాటకు ప్రాణం పోసింది ఎస్పిబాలసుబ్రమణ్యం , చిత్రలు అయితే సంగీతంతో మైమరచిపోయెలా చేసింది ఎంఎం కీరవాణి.
అయితే ఈ సాంగ్ ను సునీత పాడగా.. ఆ పాటను ఆ చిన్నారి ఎంతో శ్రద్దగా వింటోంది. అందుకనే ఆ వీడియో అందరినీ ఆకర్షిస్తోంది. అద్భుతంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. సునీత రీసెంట్గా తన అరటి తోటలో.. కూరగాయల తోటలో పనిచేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు.

దీంతో పాటు జాయ్ ఆఫ్ ఫార్మింగ్ (వ్యవసాయాన్ని ఇష్టపడుతున్నాను) అనే క్యాప్షన్ పెట్టారు. దీంతో పాటు నాకు సంగీతం అంటే ఇష్టం. అలాగే నా కుటుంబం, స్నేహితులు, నన్ను ఇష్టపడే వారిని ప్రేమిస్తాను అని వీడియోతో పాటు మన మనసులోని భావాలను వాక్యాల రూపంలో రాసుకొచ్చారు.