SUNITHA: మేడ‌మ్ నుండి క‌న్నా బుజ్జి వ‌ర‌కు… సునీత‌ను అలా పిలిచిన ద‌ర్శ‌కుడు ఎవ‌రో తెలుసా?

రెండో పెళ్లి త‌ర్వాత సింగ‌ర్, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ సునీత్ వార్త‌ల‌లో తెగ నానుతుంది. ఎంగేజ్‌మెంట్‌, పెళ్లి, ప్ర‌యాణం ఇలా పలు విష‌యాల‌కు సంబంధించిన ఆస‌క్తిర విష‌యాలు తెలియ‌జేస్తూ ఉండే సునీత తాజాగా గ‌తంలో త‌న‌ను ఇబ్బంది పెట్టిన విష‌యాల‌ను గురించి చెప్పుకొచ్చింది. ఓ ద‌ర్శ‌కుడు త‌న‌ను ముందుగా మేడ‌మ్ అని పిలిచి ఆ త‌ర్వాత క‌న్న బుజ్జి వ‌ర‌కు వెళ్లాడ‌ట‌. అది చాలా ఫన్నీ సంఘటనగా మారిందని ఆమె అనడం ఆసక్తికరం.

ఓ సారి డ‌బ్బింగ్ చెప్ప‌డానికి థియేట‌ర్‌కు వెళ్లిన‌ప్పుడు ద‌ర్శ‌కుడు ఒక‌రు మేడ‌మ్ అని సంబోధించారు.నాకు వీరాభిమాని అని కూడా చెప్పారు. కొద్ది రోజుల త‌ర్వాత సునీత అంటూ స‌ద‌రు ద‌ర్శ‌కుడు పిల‌వ‌డం మొద‌లు పెట్టారు. సునీత కాస్త అరే.. క‌న్నా.. బుజ్జీ వ‌ర‌కు వెళ్లింది. మేడమ్ నుండి పూర్తిగా పిలుపు మార‌డంతో నేను షాక్ అయ్యాను. ఇది చాలా ఫ‌న్‌గా అనిపించింది అని సునీత పేర్కొంది. అయితే సునీతతో అలా ప్ర‌వ‌ర్తించిన ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రనేది మాత్రం రివీల్ చేయ‌క‌పోవ‌డం కొస‌మెరుపు. ప్ర‌స్తుతం రామ్ వీర‌పేనితో సంతోషంగా వైవాహిక జీవ‌తం గ‌డుపుతున్న సునీత ఒక్కో విష‌యాన్ని మెల్ల‌మెల్ల‌గా రివీల్ చేస్తుంది.

Advertisement