SUNITHA: ఫ్యాన్స్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన‌ సింగ‌ర్ సునీత‌.. కార‌ణం ఏంటో తెలుసా?

సింగ‌ర్‌గా, టెలివిజన్‌ యాంకర్‌గా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సునీత‌. రెండో పెళ్లితో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా నిలిచిన సునీత సోష‌ల్ మీడియాలోను యాక్టివ్‌గా ఉంటూ నిత్యం త‌న ప‌ర్స‌న‌ల్‌, ప్రొఫెష‌న‌ల్ లైఫ్‌కు సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తూ వ‌స్తుంది. తాజాగా త‌న సోష‌ల్ మీడియా ద్వారా క్ష‌మాప‌ణ‌లు చెప్పింది . మ‌రి సునీత ఎందుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పింద‌నే క‌దా మీ డౌట్‌… త‌న మ్యూజిక‌ల్ ఈవెంట్ క్యాన్సిల్ కావ‌డం వ‌ల‌న అభిమానుల‌ని క‌ల‌వ‌లేక‌పోతున్న కార‌ణంగా క్ష‌మాప‌ణ‌లు చెప్పింది.

హైదరాబాద్‌లో కరోనా కేసులు విస్తృతంగా పెరుగుతుండడంతో మ్యూజిక‌ల్ ఈవెంట్స్, ఆడియో వేడుక‌లు వంటివి ప్ర‌భుత్వం క్యాన్సిల్ చేసింది. దీంతో ఈ రోజు మ‌ణిశ‌ర్మ మెగా మ్యూజిక‌ల్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. అంద‌రి క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని క్యాన్సిల్ చేశారు. అంద‌రు క్షేమంగా ఉండండి అంటూ సునీత త‌న ఫేస్ బుక్ పేజ్‌లో పేర్కొంది. మ‌ణిశ‌ర్మ మ్యూజిక‌ల్ ఈవెంట్‌లో సునీతతో పాటు గీతామాధురి, రమ్య, అనురాగ్‌ కులకర్ణి, సాహితి, రేవంత్ శ్రీక్రిష్ణ, సాకేత్ తదితర గాయకులు పాల్గొనాల్సి ఉంది. కాగా, సునీత ..రామ్‌ నరపనేనిని రెండో వివాహం చేసుకొని ఇటు కెరీర్‌ను, అటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్‌ చేస్తూ వస్తుంది.

Advertisement