sunitha : పెళ్లిని బాగానే ప్రమోట్ చేసుకుంటోంది.. రూట్ మార్చిన సింగర్ సునీత

Sunitha Ram Veerapaneni Wedding Film Teaser
Sunitha Ram Veerapaneni Wedding Film Teaser

sunitha :  సింగర్ సునీత రెండో పెళ్లి ఎంతటి వివాదానికి దారి తీసిందో అందరికీ తెలిసిందే. సహజంగా మగవాళ్లు రెండో పెళ్లి చేసుకుంటే ఎలాంటి అభ్యంతరాలు ఎదురవ్వవు. కానీ అదే ఓ మహిళ మాత్రం రెండో పెళ్లి చేసుకుంటే సమాజం రకరకాలు మాట్లాడుతుంది. అలా సింగర్ సునీత రెండో పెళ్లిపై రకరకాల అభిప్రాయాలు వెలువడ్డాయి. ఎవ్వరూ ఏమన్నా సరే తన పిల్లలు, తల్లిదండ్రుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని సునీత రెండో పెళ్లికి సిద్దమైంది.

సునీత రెండో పెళ్లి ..

మీడియా అధినేత రామ్ వీరపనేని న సునీత వివాహాంచేసుకుంది. అటు వైపున్న వ్యక్తిది కూడా ఇలాంటి వ్యవహారమే. అతనిది కూడా ద్వితీయ వివాహామే. రామ్ అనే వ్యక్తి సునీతకు ఎప్పటి నుంచో పరిచయం.. సునీత వ్యవహారాలన్నీ కూడా ఎప్పటి నుంచో అతనే చూసుకుంటున్నాడట. సునీత సోషల్ మీడియా ఖాతాలను హ్యాండిల్ చేసేది కూడా అతనేట. అలా మొదలైన పరిచయం ఇలా వివాహాంగా మారిందని సునీత చెప్పుకొచ్చింది.

అయితే సునీత రెండో పెళ్లిపై ఎన్ని రకాలుగా కామెంట్లు వచ్చినా వాటిని ఆమె మాత్రం పట్టించుకోలేదు. అంతే కాకుండా పెళ్లి తరువాత సోషల్ మీడియాలో తన పద్దతిని మార్చేసింది. వెరైటీ కొటేషన్‌లతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పెళ్లి తరువాత తానెంత సంతోషంగా ఉన్నాను.. తన కొత్త జీవితం ఎలా ఉందో పరోక్షంగా చెబుతున్నట్టు కొన్ని పోస్ట్‌లను చేస్తోంది. కాఫీ తాగుతూ, ఇంట్లో వరండాలో సంతోషంగా గడుపుతున్న ఫోటోలను షేర్ చేసింది.

రూట్ మార్చిన సింగర్ సునీత: sunitha

తాజాగా సునీత తన పెళ్లి వీడియోను రిలీజ్ చేసింది. ఈ మధ్య ఇదే ట్రెండ్ అవుతోంది. సునీత రామ్ వెడ్డింగ్ ఫిల్మ్ టీజర్ అంటూ ఓ వీడియోలను తన యూట్యూబ్ చానెల్‌లో రిలీజ్ చేసింది. ఇందులో నిశ్చితార్థం, మెహెందీ, హల్దీ ఈవెంట్లకు సంబంధించిన విజువల్స్ ఉన్నాయి. మొత్తానికి టీజర్‌తోనే ఇలా షాక్ ఇచ్చిన సునీత.. ట్రైలర్, సినిమాతో ఇంకెలా రచ్చ చేస్తుందో చూడాలి.

Advertisement