Sunitha: ప్ర‌కృతి ఒడిలో సునీత‌.. వ్య‌వ‌సాయం ప‌నుల‌తో బిజీ బిజీ

Sunitha: త‌న పాట‌తో, మాట‌తో మంత్ర ముగ్ధుల‌ని చేసే సింగ‌ర్ సునీత ఇటీవ‌ల వ్య‌వ‌సాయంపై దృష్టి సారించింది. సునీత ప్ర‌కృతికి పెద్ద ప్రేమికురాలు. తాను సంగీతాన్ని ప్రేమిస్తాను. అలాగే నా కుటుంబాన్ని, నా స్నేహితుల‌ను కూడా ప్రేమిస్తాను అంటూ ఆమె చెప్పింది.ఇటీవ‌ల సింగ‌ర్ సునీత..మైక్‌ను ప‌దిలేసి వ్య‌వ‌సాయం చేయ‌డం మొద‌లు పెట్టేశారు. వ్య‌వ‌సాయం చేయ‌డాన్ని ఎంతో ఇష్ట‌ప‌డుతున్నాన‌ని చెప్పేశారు సునీత‌.

sunitha new look agicultuing (1)
sunitha new look agicultuing (1)

ఇటీవ‌ల ఓ అరటి తోటకు వెళ్లిన సునీత అక్కడ అరటి గెలను స్వయంగా కోసి తన ఆనందాన్ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. ‘జాయ్‌ ఆఫ్‌ ఫార్మింగ్‌’అంటూ దానికి సంబంధించిన వీడియోను షేర్‌ చేశారు. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇక ఇప్పుడు కూర‌గాయ‌లు క‌ట్ చేస్తూ క‌నిపించింది.

తాజాగా కూరగాయలు కోస్తూ కనిపించారు సునీత. వంకాయలు, ఆకుకూరలు కోస్తూ ఓ వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌ అవుతుంది. సునీత వ్యవసాయం పనులు చేస్తుంటే పాటంత మాధుర్యంగా ఉందంటున్నారు. పాటలు, ఫ్యామిలీనే కాదు, సునీతకి వ్యవసాయం అంటే ఇష్టమనే విషయాన్ని తెలియజేస్తుంది.

గార్డెనింగ్‌, ఫార్మింగ్‌పై ఆమెకున్న ప్రత్యేక శ్రద్ధని ఇలా తన వీడియోల రూపంలో పంచుకుంటూ తెలియజేస్తుంది. అభిమానుల మనసులను దోచుకుంటుంది. `నాకు ఇలా పొలంలో పనిచేయడం అంటే చాలా ఇష్టం.. ఫ్రెష్ కూరగాయలు కోయడమంటే మరీ ఇష్టం` అని సునీత చెప్పారు. పాటలు పాడుతూ కనిపించే సునీత తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వ్యాపారవేత్త రామ్ సూర‌ప‌నేనిని ఇటీవ‌ల ఈమె పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి నుండి సునీత సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ నిత్యం నెటిజ‌న్స్‌ని అల‌రిస్తుంది.