sunitha : సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కొన్ని దశాబ్ధాల నుండి అలరిస్తూ వస్తున్నారు సునీత. చిన్న వయస్సులోనే పెళ్లి పీటలెక్కిన సునీత కొద్ది రోజులకే భర్త నుండి విడిపోయింది. ఇక అప్పటి నుండి ఇద్దరి పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ వచ్చింది. అయితే ఇటీవల డిజిటల్ రంగానికి చెందిన రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకొని మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. నిశ్చితార్ధం జరుపుకున్న ఫొటోలు బయటకు వచ్చాక కాని సునీత రెండో పెళ్లిపై క్లారిటీ రాలేదు. అంతకముందు చాలా ఇంటర్వ్యూలలో రెండో పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని చెప్పిన సునీత ఇలా సడెన్‌గా పెళ్లి పీటలెక్కేందుకు ఆసక్తి చూపడంపై అందరు అవాక్కయ్యారు.
రెండో భర్త రామ్‌తో కలిసి సంతోషమైన జీవితం గడుపుతున్న సునీత తొలిసారి తన భర్తతో దిగిన ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫొటోలో ఇద్దరు ఎంతో అన్యోన్యయంగా కనిపించారు. ఈ ఫొటో నెటిజన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఇదిలా ఉంటే సునీత, రామ్‌లు మరి కొద్ది రోజులలో హనీమూన్ టూర్‌కు వెళ్లనున్నారని తెలుస్తుంది. మంచి ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని అక్కడ కొద్ది రోజుల పాటు సంతోషంగా ఉండాలని ఈ జంట భావిస్తుంది. జనవరి 9న రాత్రి శంషాబాద్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి వేడుక జరగగా, ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబాలకు చెందిన వాళ్లతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
రామ్‌కు డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఉండగా, సునీత సోషల్ మీడియా అకౌంట్లను ఆ సంస్థ వాళ్లే హ్యాండిల్ చేసేవారు. అలా ప్రారంభమైన సునీత-రామ్ బంధం, ఇరు కుటుంబాల ఆశీర్వాదాలతో పెండ్లిదాకా వచ్చింది. తన పిల్లలు ఆకాశ్, శ్రేయ సంతోషంగా ఒప్పుకున్నాకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు సునీత పేర్కొంది. పెళ్లి తర్వాత కూడా సునీత పలు కార్యక్రమాలతో బిజీబిజీగా ఉంది.తన పెళ్లి వేడుకను స్వర్గంతో పోల్చిన సునీత నూతన జీవితం ప్రారంభించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.