SUNDEEP KISHAN: యువ హీరో పెద్ద మ‌న‌సు.. ప్ర‌శంసలు కురిపిస్తున్న నెటిజ‌న్స్

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని కుదిపేస్తుంది. చాలా మంది త‌మ త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయి దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నారు. వారిని ఆదుకునేందుకు ప‌లువురు సెల‌బ్రిటీలు న‌డుం బిగిస్తున్నారు. తాజాగా యువ హీరో సందీప్ కిష‌న్ ఎంతో మంది చిన్నారులు త‌మ త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయా అనాథ‌ల‌వుతున్నారు. వారి ఆదుకునేందుకు సందీప్ కిషన్ ముందుకు వ‌చ్చారు.

‘మీకు తెలిసి కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు ఎవరున్నా ఉంటే [email protected] ను సంప్రదించండి. వీలైనంత వ‌ర‌కు నేను , నా టీం వారిని జాగ్ర‌త్త‌గా చూసుకుంటాం. రెండేళ్ల వ‌ర‌కు తిండి, చదువుకు సంబంధించిన వ్య‌వ‌హ‌రాల‌ను చూసుకుంటాను. ప్ర‌స్తుతం ఈ క్లిష్ట స‌మ‌యంలో ఒక‌రికి ఒక‌రం అండ‌గా ఉండాలి. మీ చుట్టు ప‌క్క‌ల వారికి తోచినంత సాయం చేయండి అంటూ సందీప్ కిష‌న్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. సందీప్ కిషన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నెటిజన్లు సమర్థిస్తున్నారు. ఆయ‌న‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. సందీప్ కిషన్ చివరగా ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాతో హిట్ కొట్టేశారు. ఇప్పుడు గల్లీ రౌడీ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నారు.

Advertisement