Suma: బుల్లితెర మెగాస్టార్ దొంగ పెళ్లి సీక్రెట్ రివీల్ చేసిన యాంక‌ర్ సుమ‌

Suma: బుల్లితెర మెగాస్టార్ గా ప్రముఖ నటుడు ప్రభాకర్ సుపరిచితుడే. కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఎన్నో సీరియల్స్, రియాలిటీ షోలతో ప్రాచుర్యం పొందారు. ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో తాను రన్ చేసిన షో యాహూతో బాగా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత ప్రముఖ టీవీ ఛానెల్ లో ఎన్నో సీరియల్స్ లో నటించి మరింత క్రేజ్ సంపాదించుకున్నారు. సిల్వర్ స్క్రీన్ పై ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేశారు. ఈ తర్వాత కాలంలో ఒక్కసారిగా బుల్లితెరకు దూరమయ్యారు. కొన్నేళ్ళ తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. సీరియల్స్ నిర్మించే ప్రొడక్షన్ హౌస్ ని కూడా పెంపొందించారు.

సినిమాలకు దర్శకత్వం వహించిన ఘనత ఆయనది. ప్రస్తుతం టెలివిజన్ ఇండస్ట్రీలో హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే వ్యక్తిగా పేరు పొందారు. ఇక ఇటీవల కాలంలో ఫ్యామిలీ ని ఎక్కువగా స్టేజ్ పైకి తీసుకొస్తున్నారు. ఎన్నో రియాలిటీ షోస్ తో తన భార్య పిల్లల్ని పరిచయం చేశారు. మరికొన్ని భార్య భర్తల ప్రోగ్రామ్స్ లో ప్రభాకర్, తన భార్యతో కలిసి పర్ఫార్మెన్స్ కూడా చేశారు. ఇక అసలు విషయం ఏంటంటే.. ప్రభాకర్ రహస్యంగా పెళ్ళి చేసుకున్నారంటూ సుమ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

సుమ యాంకరింగ్ చేసే ఓ టీవీ షోలో ప్రభాకర్ నటించే సీరియల్ టీమ్ తో సందడి చేశారు. సరదాగా సాగిపోయే ఆటలో భాగంగా సుమ, ప్రభాకర్ జీవితంలో మర్చిపోలేని సంఘటనను, ఎవ్వరికీ తెలియని ఓ సీక్రెట్ ను రివీల్ చేస్తానని ఆట పట్టించారు. అలా ప్రభాకర్ లవ్ మ్యారేజ్ కి సుమ, రాజీవ్ కనకాలే సాక్షులనే విషయం బయట పెట్టారు. నిజానికి ప్రభాకర్ ది లవ్ మ్యారేజ్ అని, అప్పట్లో ఇంట్లో తెలియకుండా దొంగ పెళ్ళి చేసుకున్నారనే విషయాన్ని చెప్పారు యాంకర్ సుమ కనకాల. ఈ నేపథ్యంలో ప్రభాకర్ మాట్లాడుతూ.. తమ ప్రేమ విషయం ఇంట్లో తెలుసని, కానీ పెళ్ళి మాత్రం రహస్యంగా చేసుకున్నామని అన్నారు. ప్రస్తుతం ప్రభాకర్ పెళ్ళి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.