Suma: సోల్ మేట్స్.. గ్లాస్ మేట్స్.. ఆ ముగ్గురి పరువుదీసిన సుమ

NQ Staff - January 29, 2021 / 06:28 PM IST

Suma: సోల్ మేట్స్.. గ్లాస్ మేట్స్.. ఆ ముగ్గురి పరువుదీసిన సుమ

Suma బిగ్ బాస్ షోలో సందడి చేసిన కంటెస్టెంట్లు బయట కూడా రచ్చ రచ్చ చేస్తున్నారు. నాల్గో సీజన్ కంటెస్టెంట్లు ప్రతీరోజూ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ చేస్తూ సందడి చేస్తున్నారు. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్లను వాడుకుంటూ స్టార్ మా కొత్త ప్రోగ్రాంలను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కామెడీ స్టార్స్ అనే షో ప్రోమోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుమ స్టార్ట్ మ్యూజిక్ షో కూడా రెడీ అయింది.

ఆదివారం మధ్యాహ్నాం ఈ రెండు షోలను గ్రాండ్‌గా ప్రారంభించేందుకు అంతా రెడీ అయ్యారు. అయితే స్టార్ట్ మ్యూజిక్ షోలో మొదటి ఎపిసోడ్‌లో భాగంగా బిగ్ బాస్ షో నాల్గో సీజన్‌లోని రెండు గ్యాంగులను పట్టుకొచ్చింది. లాస్య, నోయల్, హారికలు ఓ టీం.. సోహెల్, మెహబూబ్, అఖిల్‌లన మరో టీంలుగా సుమ తీసుకొచ్చింది. ఇలా మొదటి ఎపిసోడ్‌తో మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు రెడీ అయింది.

అయితే బయట ఈ గ్యాంగులతో ఇంటర్వ్యూలు చేయాలని ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు. నోభికస్య, సామ్ (సోహెల్, అఖిల్ మోనాల్) ఇలా ఒక్కో గ్యాంగ్‌ను ఇంటర్వ్యూలు చేయాలి, లేదా అందరూ కలిసి లైవ్‌లోకి రావాలని అడుగుతుంటారు. అలా మొదటి సారిగా ఆ గ్యాంగులు ఇలా సుమ షోలో మెరిసిపోయేందుకు రెడీ అయ్యారు.

ఆ ముగ్గురి పరువుదీసిన సుమ: Suma

అయితే లాస్య, నోయల్, హారికలు ఎంట్రీ ఇవ్వడంతో వారిని సోల్ మేట్స్ అని సంబోధించింది. వెంటనే నోయల్ అందుకుని మేం సోల్ మేట్స్ అయితే వారేంటి? అని అడిగాడు. వెంటనే సుమ కౌంటర్ వేస్తూ వాళ్లు గ్లాస్ మేట్స్ అని చెప్పేసింది. గ్లాసులో ఏం కలుపుకుని తాగుతారని సుమ అంటే.. ప్రేమ అని అఖిల్ రివర్స్ పంచ్ వేశాడు. అలా అఖిల్ అనడంతో మెహబూబ్, సోహెల్ ఇద్దరూ కూడా పులిహోర కలుపంటూ అఖిల్ పరువుదీసేశారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us