Suma: అందరి ముందే బయటపెట్టేసింది.. రవికృష్ణ-నవ్యసామి పై సుమ కామెంట్స్
NQ Staff - March 11, 2021 / 12:20 PM IST

Suma బుల్లితెర పై జంటగా నటించే వారిలో కొంత మంది నిజంగా జంటగా స్థిరపడిపోతుంటారు. అయితే ఈ మధ్య మాత్రం ఓ సీరియల్ జంట సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఆ ఇద్దరే కనిపిస్తున్నారు. ఆమె కథ సీరియల్‌తో వీరి ప్రయాణం బాగానే మొదలైంది. సీరియల్ బాగానే క్లిక్ అవ్వడంతో నవ్యస్వామి, రవికృష్ణ కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. అలా ఈ ఇద్దరి కెమిస్ట్రీ కుదరడంతో మిగతా షోల్లోనూ రచ్చ రచ్చ చేస్తున్నారు.
బుల్లితెర పై వచ్చే స్పెషల్ షోలు, ఈవెంట్లలో ఈ ఇద్దరూ రచ్చ చేస్తున్నారు. మొన్న వచ్చిన శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో అయితే ఏకంగా ఈ ఇద్దరికి పెళ్లి చేసేశారు. ఆ ఫోటోలు, విజువల్స్ ముందే బయటకు రావడంతోవ అందరూ నిజంగానే పెళ్లి జరిగిందేమో అనుకున్నారు. కానీ అది ఓ ఈవెంట్ కోసం అని తెలిసి అందరూ షాక్ అయ్యారు.
బుల్లితెర పై ఇతర షోలో కనిపించిన ప్రతీసారి ఈ ఇద్దరి రొమాన్స్ ఓ రేంజ్‌లో ఉంటుంది. హగ్గులు, కిస్సులతో రెచ్చిపోతుంటారు. ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ ఎప్పుడూ టాక్ బయట రచ్చ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఈ ఇద్దరూ సుమ స్టార్ట్ మ్యూజిక్ షోలో కనిపించారు.
రవికృష్ణ-నవ్యసామి పై సుమ కామెంట్స్: Suma
మీ ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందంట కదా? అని సుమ నేరుగా అడిగేసింది. ఏం నడవడం లేదు చూడండి అంటూ నవ్య స్వామి కౌంటర్ వేసింది. మీ ఇద్దరూ కలిసి ఫ్లాట్ కూడా కొనేశారట కదా? అని సుమ మళ్లీ కూపీ లాగేందుకు ప్రయత్నించింది. ఇలాంటివి అన్నీ మీకు ఎవరు చెబుతారంటూ రవికృష్ణ కవర్ చేసే ప్రయత్నం చేశాడు.