Sukumar Wife Birthday: సుకుమార్ భార్య బ‌ర్త్‌డే వేడుక‌ ఎంత ఘ‌నంగా జ‌రిగిందో తెలుసా?

Sukumar Wife Birthday: లెక్క‌ల మాస్టారు సుకుమార్ సినిమాలు ప్రేక్ష‌కుల‌కి ఎంత వినోదం అందిస్తాయో మ‌నంద‌రికి తెలిసిందే.ఆయ‌న సినిమాలు బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంటాయి. సుకుమార్ ప్రొపెష‌న‌ల్ లైఫ్ గురించి అంద‌రికి తెలుసు. ప‌ర్స‌న‌ల్ లైఫ్ మాత్రం పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు. సుకుమార్ భార్య తబిత గురించి చాలా మందికి ఐడియా ఉండకపోవచ్చు. సుక్కు చేసే ప్రతీ పనిలోనూ తోడునీడగా ఉండటమే కాకుండా సుక్కు రైటింగ్స్ బాధ్యతలు కూడా తీసుకున్నారు తబిత.

Sukumar Wife Thabitha Birthday Celebrations

‘లాండ్రీకార్ట్’ అనే పేరుతో లాండ్రీ బిజినెస్ కూడా మొదలుపెట్టింది. ఏడాదిన్నర పాటు గ్రౌండ్‌వర్క్ చేసిన తర్వాత లాండ్రీకార్ట్‌ను ప్రారంభించామని తబిత తెలిపారు. ‘సినిమా నేపథ్యంతో ముడిపడిన సంస్థ కాదిది. మధ్యతరగతి వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని తక్కువ వ్యయంతో సర్వీసులను అందించాలని ప్రారంభించాం. వ్యాపారం చేయాలనే ఆలోచనతో కాకుండా సేవ చేస్తూనే చాలా మందికి ఉపాధి కల్పించాలనే లాండ్రీకార్ట్‌ను ప్రారంభించాం అని త‌బిత స్ప‌ష్టం చేసింది.

Sukumar Wife Thabitha Birthday Celebrations
Sukumar Wife Thabitha Birthday Celebrations

ఈ రోజుసుకుమార్‌ భార్య తబిత సుకుమార్‌ పుట్టినరోజు వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి. కుటుంబ సభ్యులతో కలిసి తబిత బర్త్‌డేను సెలబ్రేట్‌ చేసుకున్నారు. భార్య కోసం సుకుమార్‌ తాజ్‌ ఫలక్‌ నామాలో సర్‌ప్రైజ్‌ పార్టీ ఇచ్చినట్లు సమాచారం. ‘మీ ఆత్మీయుల మధ్య ఉన్నప్పుడు ఏ వేడుక అయినా అద్భుతంగా జరుగుతుంది’ అంటూ తబిత బర్త్‌డే ఫోటోలను షేర్‌చేసింది.

Sukumar Wife Thabitha Birthday Celebrations
Sukumar Wife Thabitha Birthday Celebrations

2009లో సుకుమార్‌, తబితను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి సుకృతి, సుకృత్‌ పిల్లలు. ప్రస్తుతం సుకుమార్‌ పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌ పార్ట్‌ ఈ ఏడాది డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.