Sukumar: పుష్ప 2 ఐటెం సాంగ్‌పై సుకుమార్ స్కెచ్.. ఈ సారి ఎవ‌రిని తీసుకురానున్నాడో తెలుసా?

Sukumar: ఈ మ‌ధ్య కాలంలో ప్ర‌తి సినిమాకి ఐటెం సాంగ్ త‌ప్ప‌కుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్. చిన్న సినిమాకాని, పెద్ద సినిమా కాని ఐటెం సాంగ్ అనేది కామ‌న్‌గా మారింది. ఇటీవ‌ల విడుద‌లై పెద్ద హిట్‌గా నిలిచిన పుష్ప సినిమా కోసం స‌మంత స్పెష‌ల్ సాంగ్ చేసిన విష‌యం తెలిసిందే. పుష్ప సినిమా విజయంలో సుక్కు టేకింగ్ ఒకెత్తయితే.. అల్లు అర్జున్ నటన, సమంత ఐటెం సాంగ్ మరో ఎత్తయ్యాయి.

sukumar planing for pushpa2
sukumar planing for pushpa2

పుష్ప సెకండ్ పార్ట్‌ని భారీ రేంజ్‌లో ప్లాన్ చేస్తుండ‌గా, ఈ సినిమా ‘పుష్ప ది రూల్’ పేరుతో సెకండ్ పార్ట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు సుక్కు. ఈ మేరకు పర్ఫెక్ట్ స్టోరీ సిద్ధం చేస్తున్న ఆయన.. రెండో భాగంలో ఉండబోయే స్పెషల్ సాంగ్ కోసం ఇప్పటినుంచే కసరత్తులు ప్రారంభించారట.

తొలిభాగంలో సమంత ఐటెం సాంగ్ భారీ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో రెండో భాగంలో దీన్ని మించిన సాంగ్ ప్రేక్షకుల ముందుంచాలని ఆయన స్కెచ్చేస్తున్నారట. మొదటి భాగంలో సమంతతో ఐటెం సాంగ్ చేయించి సక్సెస్ అయిన ఆయన.. రెండో భాగం కోసం మాత్రం బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దించబోతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటినుంచే బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ పేర్లను ఫిల్టర్ చేస్తున్నారట సుక్కు.

షూటింగ్ స్టార్ట్ చేసిన వెంటనే తొలి షెడ్యూల్ లోనే ఈ ఐటెం సాంగ్ షూట్ ఫినిష్ చేయాలని సుక్కు భావిస్తునట్లు ఇన్‌సైడ్ టాక్. పుష్ప మొదటి భాగం భారీ సక్సెస్ కావడం రెండో భాగంపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేసి పెట్టింది. రెండో భాగంలో కూడా ప్రధాన తారాగణం అంతా కనిపించనున్నారని, కేవలం కొన్ని క్యారెక్టర్స్ యాడ్ చేయనున్నారని తెలుస్తోంది.

sukumar (1)
sukumar (1)

పుష్ప చిత్రం డిసెంబ‌ర్ 17న థియేట‌ర్స్ లో విడుద‌ల కాగా, జ‌న‌వ‌రి 7న ఓటీటీలోకి వ‌చ్చేసింది. పుష్ప చిత్రంని ఓటీటీలో వీక్షించిన‌
సెల‌బ్స్ తెగ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.