Sukumar: బాలీవుడ్ డైరెక్ట‌ర్స్‌తో సినిమా ప్లాన్ చేస్తానంటున్న సుకుమార్.. స్ట‌న్ అవుతున్న టాలీవుడ్..!

Sukumar: భారీ బ‌డ్జెట్‌తో తెలుగు సినిమా ప్ర‌తిష్ట‌ను పెంచిన రాజ‌మౌళి త‌న క్రేజ్ మ‌రింత పెంచుకున్నాడు. బాహుబ‌లి సినిమాతో రాజ‌మౌళి స్థాయి భారీగా పెర‌గ‌గా, ఆ త‌ర్వాత టాలీవుడ్ హీరోల‌తో ఆర్ఆర్ఆర్ అనే భారీ బ‌డ్జెట్ చేశాడు. ఇప్ప‌టికీ ఆయ‌న టాలీవుడ్ హీరోల‌తో సినిమాలు చేస్తున్నాడే త‌ప్ప బాలీవుడ్ హీరోల‌వైపు ఆస‌క్తి క‌న‌బ‌ర‌చ‌డం లేదు. కాని సుకుమార్ మాత్రం బాలీవుడ్ సినిమా చేయాలని అనుకుంటున్న‌ట్టు తెలిపాడు.

sukumar planning for new project1
sukumar planning for new project1

పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన సుకుమార్ ఇటీవ‌ల మంచి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. పుష్ప సినిమాలో సుకుమార్ స్టైల్ మేకింగ్.. అల్లు అర్జున్ యాక్టింగ్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. నార్త్ నుంచి మొద‌లు సౌత్ వ‌ర‌కు పుష్ప రాజ్ ఒక అల‌జ‌డిని సృష్టించాడు. ఇక ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ స్మగ్లర్ గా నటించి ఆకట్టుకున్నాడు.

మునుపెన్నడూ కనిపించని ఊర మాస్ పాత్రలో బన్నీని చూపించి ఫ్యాన్స్ ను ఖుషి చేశారు సుక్కు. ప్రస్తుతం పుష్ప సెకండ్ పార్ట్ రూపొందించే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో పుష్ప సక్సెస్ సెలబ్రెషన్స్ జరుపుకుంటుంది చిత్రయూనిట్. ఇటీవల బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు సుకుమార్.

ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ.. “బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక హీరోతో సినిమా చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ నేను పుష్ప షూటింగ్ లో ఉండగా.. అక్షయ కుమార్ కాల్ చేసి.. తనతో ఓ సినిమా చేయలని కలవమన్నారు. అందువలన ఆయనతో ఒక సినిమా చేయాలనుకుంటున్నాను ” అంటూ చెప్పుకొచ్చారు.

sukumar planning for new project
sukumar planning for new project

పుష్ప 2 తర్వాత రామ్ చరణ్ తో మూవీ చేయనున్నాడు సుకుమార్. ఈ రెండింటి తర్వాత సుకుమార్ విజయ్ దేవరకొండ కాంబోలో సినిమా రానుంది. మొత్తానికి సుకుమార్, అక్షయ్ కుమార్ కాంబోలో సినిమా మాత్రం రాబోతుందని చెప్పేశాడు డైరెక్టర్. మ‌రి సుకుమార్ మెల్ల‌గా బాలీవుడ్ బాట ప‌ట్టనున్నాడా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.