Sukumar : రాజమౌళిని టార్గెట్ చేస్తున్న సుకుమార్.. భారీ దెబ్బ కొట్ట బోతున్నాడా..?
NQ Staff - March 17, 2023 / 09:45 AM IST

Sukumar : ఇండియన్ సినిమాల్లో ఇప్పుడు ఎవరు నెంబర్ వన్ డైరెక్టర్ అంటే అందరూ టక్కున రాజమౌళి పేరు చెప్పేసే స్థాయిలో ఉన్నాడు ఆయన. తన సినిమాలతో తన రికార్డులను తానే తిరగరాస్తూ వస్తున్నాడు. తెలుగు సినిమాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఘనత కేవలం రాజమౌళికి మాత్రమే దక్కుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే టాలీవుడ్ లో రాజమౌళికి పోటీ ఇచ్చే దర్శకుడు ఎవరా అని ఆరా తీస్తే మొన్నటి వరకు త్రివిక్రమ్ పేరు కాస్త వినపడింది. కానీ పుష్ప సినిమాతో ఇండియన్ సినిమాల చూపును తన వైపుకు తిప్పుకున్నాడు సుకుమార్. పుష్ప సినిమా అన్ని భాషల్లో భారీ వసూళ్లు రాబట్టింది. దాంతో కచ్చితంగా రాజమౌళికి పోటీ ఇచ్చే దర్శకుడు సుకుమారే అంటున్నారు.
త్రిబుల్ ఆర్ కలెక్షన్లే టార్గెట్..?
ఇక పుష్ప-2 సినిమాను కూడా అదే స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. మొదటి పార్టుకు భారీ వసూళ్లు రావడంతో రెండో పార్టు కోసం ఏకంగా రూ.500కోట్ల బడ్జెట్ ను పెడుతున్నారంట. కాగా మొన్నటి వరకు పుష్ప టార్గెట్ రూ.1000కోట్లు అని టాక్ వినపడింది. కానీ ఇప్పుడు మాత్రం త్రిబుల్ ఆర్ కలెక్షన్లు రూ.1200కోట్లను రీచ్ కావడమే పుష్ప-2 టార్గెట్ గా పెట్టుకున్నాడంట సుకుమార్.
ఎలాగైనా రాజమౌళిని తాను క్రాస్ చేయాలని భావిస్తున్నాడంట సుకుమార్. ఇందుకోసం పుష్ప-2 ను ఎవరూ ఊహించని స్థాయిలో తీస్తున్నాడంట. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో లేని సీన్లను ప్లాన్ చేస్తున్నాడంట సుకుమార్. బన్నీ టార్గెట్ కూడా అదే అని తెలుస్తోంది. అదే జరిగితే సుకుమార్ కు నేషనల్ వైడ్ గా తిరుగు ఉండదనే చెప్పుకోవాలి.