Pushpa 2 : పుష్ప 2 : మళ్లీ లీక్ అయితే ఊరుకునేది లేదు
NQ Staff - January 24, 2023 / 10:19 PM IST

Pushpa 2 : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమా చిత్రీకరణ ఇటీవలే వైజాగ్ లో ప్రారంభం అయిన విషయం తెల్సిందే. అక్కడ షూటింగ్ ప్రారంభం అయ్యిందో లేదో వెంటనే ఒక లీక్ వచ్చేసింది. అది ఏమైనా మ్యాటర్ అయితే ఏమో కానీ ఏకంగా ఒక ఫొటో లీక్ అవ్వడంతో సుకుమార్ సీరియస్ అయ్యాడట.
సుకుమార్ ఇప్పటికే లీక్ ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రొడక్షన్ వారికి సూచించారట. అయినా కూడా వారు తగిన జాగ్రత్తలు తీసుకోక పోవడంతో మరో ఫొటో బయటకు లీక్ అయ్యింది. ఈ విషయంలో సుకుమార్ సీరియస్ అవ్వడంతో పాటు మళ్లీ ఇలాంటిది జరిగితే చర్యలు తప్పవు అన్నాడట.
సినిమా యూనిట్ సభ్యుల్లో ఎవరో గుర్తు తెలియని వారి ద్వారానే మొన్నటి ఫొటో లీక్ అయ్యిందని గుర్తించారు. అందుకు సంబంధించిన వారిని కనిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇదే సమయంలో పుష్ప 2 షూటింగ్ విషయంలో కూడా సుకుమార్ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట.
అల్లు అర్జున్.. సుకుమార్ కాంబోలో 2021 సంవత్సరం డిసెంబర్ లో వచ్చిన పుష్ప భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సీక్వెల్ అంతకు మించి ఉండాలి అనే ఉద్దేశ్యంతో పుష్ప 2 ను భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాడు. 400 కోట్ల బడ్జెట్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో పుష్ప 2 సందడి చేయడం పక్కా అంటూ సుకుమార్ సన్నిహితులు చెబుతున్నారు.