Sukumar : రాజమౌళి ని ప్రిన్సిపాల్ చైర్ లో కూర్చోబెట్టిన సుకుమార్
NQ Staff - January 25, 2023 / 10:29 PM IST

Sukumar : టాలీవుడ్ జక్కన్న రాజమౌళి పై దర్శకుడు సుకుమార్ ప్రతి సారి కూడా ప్రశంసలు కురిపిస్తూనే ఉంటాడు. ఆ మధ్య ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం అయిన సమయంలో రాజమౌళి పై దర్శకుడు ప్రశంసల వర్షం కురిపించి అందరిని ఆశ్చర్యపర్చిన విషయం తెల్సిందే.
తాజాగా నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డుకు నామినేట్ అవ్వడంతో సుకుమార్ మరోసారి దర్శక ధీరుడు జక్కన్న పై ప్రశంసలు కురిపించాడు. తాను టీమ్ తో కథ చర్చలు జరుపుతున్న సమయంలో ఒక సీటును వదిలేస్తాను. ఆ సీటు ప్రిన్సిపాల్ సీటు. అది మీకు మాత్రమే సొంతం.
నేను ఎప్పటికి కూడా ఆ సీటును మీ కోసం కేటాయించే ఉంచుతాను అన్నట్లుగా సుకుమార్ పేర్కొన్నాడు. అంతే తన సినిమాల్లో రాజమౌళికి సింహ భాగాన్ని సుకుమార్ ఇవ్వడం చాలా గొప్ప విషయం. దర్శకుల మధ్య ఈగో క్లాష్ లు ఉండే అవకాశం ఉంటుంది.
కానీ రాజమౌళి మరియు సుకుమార్ ల మధ్య ఎప్పుడు కూడా అలాంటి క్లాష్ లు లేనే లేవు. ఇద్దరి మధ్య కూడా మంచి సంబంధాలు ఉండటంతో చాలా మంది గొప్ప గా మాట్లాడుకుంటూ ఉన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వీరిద్దరు కూడా గొప్ప దర్శకులు. అలాంటి ఇద్దరి మధ్య ఇలాంటి సన్నిహిత సంబంధాలు ఉండటం గొప్ప విషయం.