Sujeeth : సుజీత్ ని టాలీవుడ్ రిజెక్ట్ చేస్తే బాలీవుడ్ బంపర్ ఆఫర్ ఇచ్చింది..!

Sujeeth : సుజీత్ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. యంగ్ హీరో శర్వానంద్ – సీరత్ కపూర్ జంటగా నటించిన ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ నిర్మించారు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవడంతో ఈ యంగ్ డైరెక్టర్ కి ఏకంగా ప్రభాస్ తో సినిమా చేసే గోల్డెన్ ఛాన్స్ అందుకున్నాడు. యూవి క్రియేషన్స్ లో 350 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ సినిమాగా సాహో తెరకెక్కించాడు సుజీత్. కేవలం ఒక్క సినిమా అనుభంతో సుజీత్ కి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇవ్వడానికి కారణం తను ప్రభాస్ కి స్టోరీ నరేట్ చేసిన విధానమే.

sujeeth is rejected by tollywood but bollywood gave offer to him
sujeeth is rejected by tollywood but bollywood gave offer to him

హాలీవుడ్ రేంజ్ లో సినిమా చేస్తానని ప్రభాస్ కి నమ్మకం కలిగించాడు. ప్రభాస్ కూడా సుజీత్ నమ్మి సినిమా చేశాడు. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ప్రభాస్ ని నిజంగా హాలీవుడ్ హీరోలా చూపించి సక్సస్ అయ్యాడు సుజీత్. బాలీవుడ్ లో భారీ హిట్ గా నిలిచింది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. ముఖ్యంగా బాలీవుడ్ లో సుజీత్ టాలెంట్ కి ప్రముఖుల నుంచి గొప్ప ప్రశంసలు దక్కాయి. అంతేకాదు ముందు నుంచి ప్రభాస్ కూడా సుజీత్ కి బాగా సపోర్ట్ చేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది.

Sujeeth : సుజీత్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటన్నది ఇన్నాళ్ళు పెద్ద డైలమాగా ఉండింది.

దాంతో సుజీత్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటన్నది ఇన్నాళ్ళు పెద్ద డైలమాగా ఉండింది. టాలీవుడ్ లో మెగాస్టార్ సినిమా మిస్ అయ్యాక మళ్ళీ మరో ప్రాజెక్ట్ రాలేదు. కాని అనూహ్యంగా బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ వచ్చిందని లేటెస్ట్ అప్‌డేట్. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మించబోతోందట. యాక్షన్ థ్రిల్లర్ డ్రామా గా ఈ సినిమాని సుజీత్ తెరకెక్కిస్తాడని తెలుస్తోంది.  అంతేకాదు ఎమోషనల్ టచ్ కూడా ఉంటుందని సుజీత్ తెలిపాడు. కాగా త్వరలో సెట్స్ మీదకి రానున్న ఈ సినిమా 2022లో విడుదలకానుంది.

Advertisement