Sudigali sudheer : సుడిగాలి సుధీర్ వావ్ : సిక్స్ ప్యాక్ !
Vedha - February 5, 2021 / 10:38 AM IST

Sudigali sudheer : సుడిగాలి సుధీర్ ప్రస్తుతం బుల్లితెర మీద క్రేజ్ ఉన్న వాళ్ళలో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఏ షో చేసినా అందులో తన మార్క మానరిజం తో..పంచ్ డైలాగులతో ప్రేక్షకులను నవ్విస్తూ ఆకట్టుకుంటున్నాడు. డాన్స్ షో లో గాని జబర్దస్త్ షో లో గాని సుధీర్ కి ప్రత్యేకమైన ఇమేజ్ వచ్చేసింది. ఒకరకంగా బుల్లితెర మీద మంచి స్టార్ డం ని సంపాదించుకున్నాడు సుధీర్. ఇక రష్మీ గౌతం – సుధీర్ కాంబినేషన్ అంటే వరసగా మూడు నాలుగు సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న హిట్ పేయిర్ కి ఉన్నంత క్రేజ్ ఉంది. ప్రేక్షకులను ఈ ఇద్దరిని చూడటానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.

sudigali-sudheer-wow-six-packs
ఇక అందరిలాగే సుధీర్ కూడా కూడా హీరోగా క్రేజ్ తెచ్చుకోవాలని తాపత్రయపడుతున్నాడు. అలాగే సాఫ్ట్ వేర్ సుధీర్ అన్న సినిమాతో హీరోగా కూడా మారాడు. ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఆ తర్వాత వచ్చిన త్రీ మంకీస్ అన్న సినిమా కూడా పరవాలేదనిపించుకుంది. అయితే ఇప్పుడు కొత్తగా ట్రై చేస్తున్నాడు. టీవీ షోస్ కంటే సినిమాలు చేసేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే జిం లో కసరత్తులు చేసి సిక్స్ ప్యాక్ ట్రై చేస్తున్నాడు. నిజంగా ఏదైనా సినిమాలో బాలీవుడ్ హీరోల మాదిరిగా చొక్కా విప్పి సిక్స్ ప్యాక్ చూపించాలనుకుంటున్నాడా ఏమో తెలియదు గాని ఈ మధ్య గంటలు గంటలు జిం లో గడుప్తున్నాడట.
Sudigali sudheer : స్టార్ హీరోల మాదిరిగా సుధీర్ కూడా సిక్స్ పాక్ ట్రై చేస్తుండటం అందరికీ షాకింగ్..!
అయితే సుధీర్ ఇంత కష్టపడుతుంది మాత్రం ఒక కొత్త సినిమా కమిటవ్వడం వల్లే అని తెలుస్తోంది. సుధీర్ హీరోగా ఒక కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తెరకెక్కబోతోందట. ఈ సినిమా అల్లరి నరేష్ చేస్తున్న సినిమాల మాదిరిగా పేరడి కాన్సెప్ట్ తో రూపొందబోతుందని అంటున్నారు. అందుకే ఈ సినిమా కోసం సిక్స్ పాక్ బాడీని బిల్డ్ చేస్తున్నాడని సమాచారం. మొత్తానికి స్టార్ హీరోల మాదిరిగా సుధీర్ కూడా సిక్స్ పాక్ ట్రై చేస్తుండటం అందరికీ కాస్త షాకింగ్ గాను కామెడిగాను ఫీలవుతున్నారట. చూడాలి మరి సుధీర్ ఏ సినిమాలో సిక్స్ ప్యాక్ చూపించబోతున్నాడో.