Sudigali Sudheer : నా జీవితాంతం మీ అందరికీ రుణపడి ఉంటాను.. సుడిగాలి సుధీర్ ఎమోషనల్
NQ Staff - November 18, 2022 / 09:55 AM IST

Sudigali Sudheer : ఒక మెజీషియన్ స్థాయి నుండి కమెడియన్ గా ఎదిగి జబర్దస్త్ ద్వారా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న సుడిగాలి సుదీర్ హీరోగా రూపొందిన గాలోడు ఈనెల 18వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు భారీగా నిర్వహించారు. సుదీర్ కి ఉన్న ఇమేజ్ మరియు క్రేజ్ నేపథ్యంలో మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అంటూ సమాచారం అందుతుంది. నిన్న రాత్రి ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు.
ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ వేడుకలో రష్మి గౌతమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతే కాకుండా నందు, సుమ ఇంకా జబర్దస్త్ కు చెందిన పలువురు కూడా హాజరపడంతో కార్యక్రమం కలర్ ఫుల్ గా సాగింది.
ఈ సందర్భంగా సుడిగాలి సుదీర్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. ఈ సినిమా కోసం దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు అందరం కష్టపడ్డాం.. మంచు ప్రాంతాల్లో కనీసం ఆక్సిజన్ కూడా అందరిని ప్రాంతాల్లో చాలా కష్టపడి సినిమాను తరికెక్కించాం.
అందరం కూడా అంకితభావంతో పని చేయడం వల్లే ఈరోజు ఇంత మంచి ఔట్పుట్ వచ్చింది. సినిమా యొక్క ప్రీ రిలీజ్ వేడుక చేయాలని నిన్న రాత్రి అనుకున్నాము. ఉదయమే అందరికీ కాల్ చేశాను. ఒక్క కాల్ తోనే ఇంత మంది వచ్చారు.. అలాగే అభిమానులు కూడా చాలామంది వచ్చారు.
ఇంతకంటే ఏం కావాలి సినిమా సక్సెస్ కి మించి ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది, ఇండస్ట్రీకి వచ్చి నేను సాధించింది మీ ప్రేమ మీ అభిమానం. నా జీవితం మొత్తం మీ అందరికీ రుణపడి ఉంటాను అంటూ అభిమానులకు మరియు ఉద్దేశించి సుడిగాలి సుదీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.