Sudigali Sudheer : ఎట్టకేలకు ఒక్కటైన సుధీర్-రష్మీ.. త్వరలోనే గుడ్ న్యూస్..!
NQ Staff - April 1, 2023 / 05:47 PM IST

Sudigali Sudheer : బుల్లితెరపై ఓ కొత్త ఒరవడి సృష్టించింది మల్లెమాల. జబర్దస్త్ లో కామెడీ మాత్రమే కాకుండా లవ్ ట్రాక్ లను కూడా సృష్టించింది. ఇందులో కొన్ని జంటలు పెండ్లి పీటలు కూడా ఎక్కాయి. అయితే మిగతా జంటలన్నింటికంటే చాలా ఫేమస్ అంటే మాత్రం అందరికీ టక్కున సుధీర్-రష్మీ పేర్లు మాత్రమే వినిపిస్తాయి. బుల్లితెరపై మొదటి లవ్ ట్రాక్ అంటే కూడా ఇదే.
ఇక మల్లెమాల నుంచి సుధీర్ వెళ్లిపోయిన తర్వాత రష్మీ ఒంటరి అయిపోయింది. కానీ వీరిద్దరి జంటకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని అప్పుడప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో సుధీర్ ప్రస్తావన తీసుకు వస్తున్నారు. దాంతో అప్పుడు రష్మీ కూడా ఎమోషనల్ అయిపోతోంది. వీరిద్దరూ కలిసి ఒకే స్టేజిపై కనిపించాలని చాలామంది కోరుకుంటున్నారు.
తాజా ఎపిసోడ్ లో..
అయితే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోను రిలీజ్ చేశారు. థాంక్యూ స్పెషల్ థీమ్ తో ఈ ఎపిసోడ్ ను నిర్వహిస్తున్నారు. బుల్లితెర స్టార్లుగా ఎదిగిన వారు.. తమ ఎదుగుదలకు ప్రోత్సాహం అందించిన వారిని గుర్తు చేసుకుని వారికి ధన్యావాదాలు చెప్పే విధంగా ఈ ఎపిసోడ్ ను తీర్చి దిద్దుతున్నారు.
తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో సుధీర్ కూడా కనిపించాడు. అయితే సుధీర్ తన ప్రయాణంలో బాగా హెల్ప్ చేసిన రష్మీపై ప్రేమను బయటపెట్టే ఆస్కారం ఉంది. వీరిద్దరూ కెరీర్ పరంగా ఒకరికి ఒకరు చాలా సాయపడ్డారు. కాబట్టి కచ్చితంగా ఈ ఎపిసోడ్ లో ఊహించనిది ఏదో జరగబోతోందని అంచనా వేస్తున్నారు.