Gaalodu : సుధీర్‌ ‘గాలోడు’ మొదటి రోజు కలెక్షన్స్… ‘జిన్నా’ ఫుల్‌ రన్ కంటే ఎక్కువే!

NQ Staff - November 19, 2022 / 02:24 PM IST

Gaalodu : సుధీర్‌ ‘గాలోడు’ మొదటి రోజు కలెక్షన్స్… ‘జిన్నా’ ఫుల్‌ రన్ కంటే ఎక్కువే!

Gaalodu : జబర్దస్త్ స్టార్ సుడిగాలి సుదీర్ హీరోగా నటించిన గాలోడు నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బుల్లి తెర సూపర్‌ స్టార్ అంటూ మంచి పేరు సొంతం చేసుకున్న సుధీర్ కి వెండి తెరపై ఇప్పటి వరకు సాలిడ్ సక్సెస్ దక్కలేదు.

ఈ సినిమా తో ఆ సక్సెస్ దక్కినట్లే అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. మొదటి రోజు గాలోడు కోటి రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్స్ నమోదు చేసినట్లుగా సమాచారం అందుతుంది.

మంచు హీరో విష్ణు నటించిన జిన్నా సినిమా ఫుల్ రన్ లో ప్రపంచ వ్యాప్తంగా 68 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ నమోదు చేసింది. సుధీర్ మొదటి రోజే కోటి రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్స్ నమోదు చేసి తన సత్తా చాటాడు.

గాలోడు సినిమా లో సుడిగాలి సుదీర్ మాత్రమే తెలిసిన వ్యక్తి అన్నట్లుగా ఉన్నాడు. ఇతరులు పెద్దగా తెలిసిన వాళ్లు కాదు మరియు దర్శక నిర్మాతలు కూడా ఇంతకు ముందు సూపర్ హిట్స్ దక్కించుకున్న వాళ్లు కాదు. అయినా కూడా మంచి కథ కథనం మాస్ ఎలిమెంట్స్‌ ఉండడం వల్ల గాలోడు సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

సుధీర్‌ భారీ విజయాలను ముందు ముందు దక్కించుకోబోతున్నాడు అనేందుకు నిదర్శణం అన్నట్లుగా గాలోడు సినిమా నిలుస్తుందని అంటున్నారు. సినిమాకు పోటీ లేక పోవడంతో గాలోడు కచ్చితంగా బ్రేక్ ఈవెన్‌ సాధించడమే కాకుండా ఏడు నుండి పది కోట్ల రూపాయల వరకు వసూళ్లు నమోదు చేసే అవకాశం ఉందంటున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us