Sudigali Sudheer : సుడిగాలి సుధీర్..! ఈ సారి రష్మీని వదిలేదే లే.!
NQ Staff - November 23, 2022 / 09:12 AM IST

Sudigali Sudheer : జబర్దస్త్ షోతో ‘సుడిగాలి సుధీర్’గా పిచ్చ పాపులర్ నటుడు సుధీర్. బుల్లితెరపై కమెడియన్‌గానే కాదు, యాంకర్‌గానూ తనదైన ముద్ర వేసుకున్నాడు. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ తదితర రియాల్టీ షోలతో సుడిగాలి సుధీర్ యాంకర్‌గా సత్తా చాటాడు.
ఇక, కమెడియన్‌గా సుధీర్‌కి తిరుగులేని అభిమానం వుంది. బుల్లితెరపై సత్తా చాటుతూనే మరోవైపు పెద్ద తెరపైనా ప్రయోగాలు చేస్తుంటాడు సుడిగాలి సుధీర్.
అందులో భాగంగానే, గతంలోనే ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ అను సినిమాలో హీరోగా నటించాడు సుడిగాలి సుధీర్. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన రిజల్ట్ అందుకోలేదు. హై ఓల్టేజ్ ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అయిన సుధీర్ బాడీ లాంగ్వేజ్‌కి కాస్త దూరంగా వున్న సినిమా కావడం వల్లనో ఏమో, ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించలేకపోయారు.
సుధీర్‌తో రెడ్డిగారి మూడో సినిమా.! హీరోయిన్ మాత్రం ‘ఆమె’నే.!
సుధీర్‌తో ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలోనే తాజాగా ‘గాలోడు’ సినిమా తెరకెక్కింది. రీసెంట్‌గా ధియేటర్లలో ప్రేక్షకుల్ని పలకరించాడు ‘గాలోడు’గా సుధీర్. ఈ సినిమా సక్సెస్ అయ్యింది.
సుధీర్‌కున్న మాస్ ఇమేజ్‌ని ఈ సారి డైరెక్టర్ బాగా క్యాష్ చేసుకున్నాడు సక్సెస్ అయ్యాడు. అయితే అసలు విషయమేంటంటే, ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ సినిమాలో హీరోయిన్‌గా రష్మీని అనుకున్నాడట డైరెక్టర్. కుదరలేదట.
ఇప్పుడు ‘గాలోడు’ కోసం కూడా రష్మీనే హీరోయిన్‌గా ఎంచుకోవాలనుకుంటున్నాడట. ఈసారి కూడా రష్మీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో కుదరలేదట. ఇక ముచ్చటగా మూడోసారి తగ్గేదేలే.. అంటున్నాడు డైరెక్టర్. సుధీర్‌తో రాజశేఖర్ రెడ్డి ముచ్చటగా మూడోసారి ‘గజ్జెల గుర్రం’ అను సినిమా తీయనున్నాడట. ఈ సినిమాకి హీరోయిన్‌గా రష్మీని ఎలాగైనా ఒప్పిస్తానని బల్లగుద్ది చెబుతున్నాడు రాజశేఖర్ రెడ్డి.