Sudheer: నాకు అన్నీ నువ్వే కదా.. రష్మీకి సుధీర్ ఎమోషనల్ టచ్
NQ Staff - March 27, 2021 / 05:00 PM IST

Sudheer బుల్లితెర పై సుధీర్ రష్మీ జంట గురించి అందరికీ తెలిసిందే. గత ఏడేళ్లుగా బుల్లితెరపై అందరినీ ఆకట్టుకుంటూ ఉంటున్నారు. ఈ జంట ప్రేమలో ఉందని, పెళ్లి కూడా చేసుకోబోతోన్నారంటూ రకరకాల వార్తలు, రూమర్లు, గాసిప్స్ వస్తూ ఉండేవి. ఇంకా వస్తూనే ఉన్నాయి. కానీ తాము ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు అలా నటిస్తామని, తెర వెనక అలా ఏమీ ఉండమంటూ ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చారు.
అయితే సుధీర్ రష్మీ ఎంత చెప్పినా కూడా వారి అభిమానులు మాత్రం వారిని అలానే చూస్తుంటారు. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని నిత్యం సోషల్ మీడియాలో అడుగుతుంటారు. జబర్దస్త్, ఢీ షోల్లో వీరు పండించే కెమిస్ట్రీకి జనాలకు లేనిపోని అనుమానాలు వస్తుంటాయి. తాజాగా మరోసారి ఈ ఇద్దరూ రెచ్చిపోయారు. ఎక్స్ ట్రా జబర్దస్త్ స్కిట్లో రష్మీని ఎమోషనల్‌గా టచ్ చేశాడు సుధీర్. ఈ మేరకు వదిలిన ప్రోమో వైరల్ అవుతోంది.
నాకు అన్నీ నువ్వే కదా.. రష్మీకి సుధీర్ ఎమోషనల్ టచ్
సుధీర్ బర్త్ డే సెలెబ్రేషన్స్ అంటూ దమ్ము దీవెన, రితిక రచ్చ చేస్తుంటారు. బర్త్ డే పార్టీకి మీ ఇద్దరే వచ్చారా? ఇంకా ఎవ్వరూ రాలేదా? అని రష్మిని ఉద్దేశించి సుధీర్ కౌంటర్ వేస్తాడు.దీంతో ఆ పిల్లలిద్దరూ రష్మీని తీసుకొస్తారు. ఇక ఒకరికొకరు కేక్‌ను తినిపించుకుంటారు. ఎవరైనా అమ్మనాన్నలకు కేక్ మొదటగా పెడతారు..నువ్వేంటి నాకు పెట్టావ్ అని రష్మీ అంటుంది. అమ్మైనా, నాన్నైనా నాకు అన్నీ నువ్వే కదా అని రష్మిని సుధీర్ ఎమోషనల్‌గా టచ్ చేశాడు.