Gaalodu : మొదటి మూడు రోజుల్లో ‘గాలోడు’ రాబట్టిన మొత్తం ఎంతో తెలుసా?

NQ Staff - November 21, 2022 / 09:44 AM IST

Gaalodu : మొదటి మూడు రోజుల్లో ‘గాలోడు’ రాబట్టిన మొత్తం ఎంతో తెలుసా?

Gaalodu : సుడిగాలి సుదీర్ హీరో గా రూపొందిన గాలోడు చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా కు మొదటి నుండి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. మంచి పబ్లిసిటీ చేయడం వల్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఎక్కువగానే అయింది.

దాంతో గాలోడు సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ఏకంగా 4.2 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసినట్లుగా సమాచారం అందుతుంది. మూడున్నర కోట్లకు కాస్త అటు ఇటుగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా నాలుగు కోట్ల కు పైగా కలెక్షన్స్ నమోదు చేయడంతో మొదటి మూడు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సొంతం చేసుకున్నట్లయ్యింది.

ఈ మధ్య కాలంలో సినిమాలు బ్రేక్ ఈవెన్ సాధించడమే గగనమైంది.. అలాంటిది సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించడం ఒక అద్భుతం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

ఒకటి రెండు ఏరియాల్లో మినహా అన్ని ఏరియాల్లో కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించినట్లుగా చిత్రం నిర్మాతలు అనధికారికంగా చెబుతున్నారు. ఇప్పటికే సినిమా కు సంబంధించిన పాజిటివ్ టాక్ రావడం తో ఈ వారం రోజులు కచ్చితంగా మరింతగా కలెక్షన్స్ ఉండే అవకాశం ఉందని కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

లాంగ్ రన్ లో ఈ సినిమా మినిమంగా ఏడు నుండి ఎనిమిది కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకం తో ఉన్నారు. మరి ఆ స్థాయిలో సినిమా వసూళ్లు సాధిస్తుందా అనేది చూడాలి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us