అదిరిపోయిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ మూవీ మోషన్ పోస్టర్

Admin - October 30, 2020 / 05:29 PM IST

అదిరిపోయిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ మూవీ మోషన్ పోస్టర్

టాలీవుడ్ యువ హీరో సుధీర్ బాబు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే తాజాగా సుధీర్ బాబు నటిస్తున్న ‘శ్రీదేవి సోడా సెంటర్’ మూవీ మోషన్ పోస్టర్ ను ఆ చిత్ర యూనిట్ విడుదల చేసారు. ఇక ఈ చిత్రాన్ని 70mm ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై రూపొందిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇక శ్రీదేవి సోడా సెంటర్ చిత్ర యూనిట్ సుధీర్ బాబు ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు.

ఇక ఈ మోషన్ పోస్టర్ చూస్తుంటే సుధీర్ బాబు ఒక చేతిలో సోడా సీసా పట్టుకొని, మరొక చేతి భుజానికి లైటింగ్ వైర్లను వేసుకొని, కాస్త నవ్వుతూ కనిపిస్తున్నాడు. ఇక దీన్ని బట్టి చూస్తే సుధీర్ బాబు ఒక లైటింగ్ పెట్టె కుర్రోడి పాత్రలో కనిపించబోతున్నాడని స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఒక జాతరలో లైట్స్ పెట్టి అనంతరం సోడా తాగుతున్న సన్నివేశంలో ని ఫొటోలాగా కనిపిస్తుంది. ఇక మొత్తానికి ఒక మాస్ లుక్ లో సుధీర్ బాబు కనిపిస్తున్నాడు. అంతేకాదు పల్లెటూరి బ్యాక్ రౌండ్ లో ఈ సినిమా ఉండబోతున్నట్లు ఈ మోషన్ పోస్టర్ చూస్తుంటే తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఈ మోషన్ పోస్టర్ కు సుధీర్ బాబు అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.

 

Read Today's Latest Videos in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us