Sudheer Babu : కేటీఆర్ మంచి న‌టుడు అని కాంప్లిమెంట్స్ ఇచ్చిన మ‌హేష్ బావ‌

Sudheer Babu : తెలంగాణ విజువల్ ఎఫెక్ట్స్ .. యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘ఇండియా జాయ్’ పేరుతో మీడియా అండ్ ఎంటర్టైన్ మెంట్ ఫెస్టివల్ మంగళవారం రోజున హైదరాబాద్ .. హైటెక్స్ లో ఆరంభమైంది. ఈ కార్య‌క్రమంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. హీరో సుధీర్ బాబు కూడా హాజరయ్యారు.

Sudheer Babu about minister KTR
Sudheer Babu about minister KTR

ఈ వేదికపై ఆయన మాట్లాడుతూ .. “నేను కేటీఆర్ గారికి పెద్ద ఫ్యాన్ ని. ఆయన మంచి పొలిటీషియన్ మాత్రమే కాదు .. మంచి నటుడు కూడా. ఏ నటుడైనా వేరే పాత్ర చేయాలంటే తనని తాను మరిచిపోయి వేరే పాత్రలోకి ప్రవేశించాలి. అలా చేస్తేనే ఆ పాత్రకి న్యాయం చేసినవాళ్లమవుతాము. అలాగే పొలిటీషియన్స్ కూడా .. తమచుట్టూ ఉన్నవారి బాగోగులు చూసుకోవాలన్నా తమని తాము మరిచిపోయి పనిచేయవలసి ఉంటుంది. అలాంటి ఓ మంచి పొలిటిషియన్ ను నేను కేటీఆర్ గారిలో చూశాను అని ప్ర‌శంస‌లు కురిపించారు.

Sudheer Babu about minister KTR
Sudheer Babu about minister KTR

కేటీఆర్‌ వాటిని సీరియస్‌గా కాకుండా చిరునవ్వుతో స్వీకరించారు. దానికి కేటీఆర్ స్పందిస్తూ.. సుధీర్ నన్ను నటుడ్ని చేశాడు.. నేను రాజకీయ నాయ‌కుడిగా కాకుండా నటుడిగా కనిపిస్తున్నానా.. ఈ విషయాన్ని నేను మనసులో పెట్టుకుంటా.. అంటూ సుధీర్‌ని కాసేపు ఆటపట్టించారు.

కంగారు పడకు.. నీ మాటల్ని నేను పాజిటివ్‌గా తీసుకుంటున్నా.. ధన్యవాదాలు సుధీర్ అని అనడంతో నవ్వులు పూశాయి. కరోనా సమయంలో సినిమా ఇండస్ట్రీ చాలా పెద్ద సమస్యను ఎదుర్కొంది. అలాంటి సమయంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కి ఆదరణ పెరిగింది.

ఓటీటీ వలన కొత్త టాలెంట్ వస్తోంది .. బౌండరీస్ లేకుండా కొత్త ప్రాజెక్టులను రెడీ చేసుకోవచ్చు. థియేటర్లలో సినిమాలంటే కొన్ని లెక్కలు ఉంటూ ఉంటాయి. క్రియేటివిటీ పరంగా కొన్ని పరిధులు ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఐపీఎల్ లాంటిది .. మంచి డ్రామా కూడా ఉంటుంది.

మెయిన్ మ్యాచెస్ లాంటి సినిమాలను మాత్రం థియేటర్లలోనే చూస్తే బాగుంటుంది. మీ అందరూ ఇక్కడికి వచ్చారు .. అందరం ఇక్కడ కలిశామంటేనే ఈ ఈవెంట్ ను మీరు సపోర్టు చేస్తున్నారనే విషయం అర్థమవుతోంది” అంటూ చెప్పుకొచ్చాడు కేటీఆర్.