Sudheer And Rashmi : సుధీర్ వెంట రష్మి కూడా.! బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ ఖాయమేనా.?
NQ Staff - October 4, 2022 / 12:03 PM IST

Sudheer And Rashmi : తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో ఆరో సీజన్ చప్పగా సాగుతోందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ షోకి అవసరమైన ‘గ్లామర్ ఫ్యూయల్’ అందించేందుకు, నిర్వాహకులు హాట్ అండ్ స్పైసీ జంటను హౌస్‌లోకి పంపించబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది.
ఆ జంట ఇంకెవరో కాదు సుధీర్ – రష్మి అట.! నిజానికి, షో ప్రారంభానికి ముందే ఈ జంట పేరు తెరపైకొచ్చింది. కానీ, షోలోకి నేరుగా వాళ్ళు వెళ్ళలేదు. రోజులు, వారాలు గడుస్తున్నాయ్.. సుధీర్, రష్మి ఎక్కడ.? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు దూసుకొస్తున్నాయ్.
వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. నిజమేనా.?
త్వరలో, అతి త్వరలో బిగ్ హౌస్‌లోకి సుధీర్ – రష్మి జంట గ్లామరస్ ఎంట్రీ ఇవ్వబోతున్నారట. అది కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా. ప్రస్తుతం ఇద్దరూ క్వారంటైన్‌లో వున్నారని సమాచారం.
తొలుత కేవలం సుధీర్ మాత్రమే వెళతాడని అనుకున్నా, చివరి నిమిషంలో రష్మిని కూడా ఒప్పించారట బిగ్ బాస్ నిర్వాహకులు.
రికార్డు స్థాయి రెమ్యునరేషన్‌తో ఈ జంటని హౌస్‌లోకి పంపిస్తున్నారని సమాచారం. సుడిగాలి సుధీర్ అంటేనే బోల్డంత ఫన్. రష్మి అంటే గ్లామర్ బాంబ్.!
ఈ ఇద్దరూ హౌస్‌లో వుంటే బీభత్సమైన రొమాంటిక్ జర్నీ ఖాయం.! కానీ, ఇదంతా నిజమేనా.? జస్ట్ వెయిట్ అండ్ సీ.!