Subhalekha Sudhakar: హోట‌ల్‌లో పని అడిగితే ఇవ్వ‌లేదు, ఒత్తిడికి గురయ్యాను: శుభలేఖ సుధాకర్

Subhalekha Sudhakar: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది గొప్ప నటీనటులున్నారు. సినిమా అంటే ప్రేమతో.. సినిమానే జీవితంగా మలుచుకుని ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఎంతో చక్కగా నటించి, ప్రేక్షకుల్ని మెప్పించారు. అలాంటి నటుల్లో శుభలేఖ సుధాకర్ కూడా ఒకరు. శుభలేఖ అనే సినిమాతో గుర్తింపు పొందిన సుధాకర్, ఈ సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకుని రాణించారు. ఎన్నో కీలకమైన పాత్రలు చేసి అలరించారు. రీసెంట్ గా శుభలేఖ సుధాకర్ తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన సినీ కెరీర్ గురించి బోల్డెన్ని విశేషాల్ని షేర్ చేసుకున్నారు.

Subhalekha Sudhakar

సముద్రమన్నాక కెరటాలు, జీవితమన్నాక కష్టాలు ఉంటూనే ఉంటాయి. వాటిని మనం ఎంత ధైర్యంగా ఎదుర్కున్నామనేది ముఖ్యం. అలాంటి ఎన్నో కష్టాలు తన జీవితాన్ని కూడా సతమతం చేశాయని సుధాకర్ అన్నారు. నటుడిగా తాను సినీ కెరీర్ మొదలుపెట్టి 40 ఏళ్ళు అయ్యింది. అయితే జీవితంలో సుఖం ఉన్నట్లే.. కష్టం ఉంటుంది. ఈ రెండింటిని మన జీవితంలో రైలు పట్టాల మాదిరిగా సమానంగా నడిపించాలని అన్నారు. మొదట్లో తాను నటుడిగా కావాలనుకుని మద్రాసు వచ్చినప్పుడు చాలా సన్నగా చీపురు పుల్లలా ఉండేవారని, ఉఫ్ అంటే ఎగిరిపోయేలా ఉండేవాడిని అన్నారు.

అలాంటి తాను నటుడిగా ఇన్నేళ్ళు ప్రయాణం చేస్తానని అస్సలు అనుకోలేదని అన్నారు. అలాగే తన అదృష్టంతో పాటు ఆయన తల్లిదండ్రుల ఆశీస్సులతో కెరీర్ సాగిందని అన్నారు. బుల్లితెరపై కూడా శుభలేఖ సుధాకర్ తన టాలెంట్ ని నిరూపించుకున్నారు. అయితే సినిమాలు లేకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డానని అన్నారు. ఎందుకిలా జరిగింది.. నాకు అవకాశాలు రాకపోవడంలో ఏదైనా పొరపాటు చేశానా అని ఆలోచించారట. షూటింగ్ కి టైమ్ వెళ్తాను, డైరెక్టర్స్ చెప్పినట్లు డెలివరీ చేసేవాడిని, తన పాత్రలు కూడా ఆడియన్స్ కి నచ్చుతున్నాయి.

మరీ ఎందుకిలా జరుగుతుందని తనలో తానే మదనపడినట్లు తెలిపారు. అలాగే టెలివిజన్ కి వచ్చినా కూడా తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలనే ఆలోచించానని అన్నారు. అలా సీరియల్స్ లో కూడా మంచి పాత్రలు వరించాయి. ఒకానొక సిట్యూవేషన్ లో ఏ వర్క్ లేనప్పుడు గతంలో తాను పనిచేసిన హోటల్ కి వెళ్ళి పని కావాలని అడిగారట. వాళ్ళు నవ్వారని, ఆ తర్వాత తన ఫ్రెండ్స్ సర్కిల్ లో పని కావాలని అడిగితే నవ్వారని అన్నారు. అప్పటికే శుభలేఖ సుధాకర్ దాదాపు 90 సినిమాల్లో వర్క్ చేశానని అన్నారు.