Nandamuri Balakrishna: ఆహా కోసం హోస్ట్‌గా బాల‌య్య‌.. మేకింగ్ పిక్స్ విడుద‌ల

Nandamuri Balakrishna: ఇన్నాళ్లు వెండితెర‌పై ద‌డ‌ద‌డ‌లాడించిన బాల‌కృష్ణ ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫాంలో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ఆహా కోసం హోస్ట్‌గా మారి వినోదం పంచ‌నున్నాడు. ఫస్ట్ టైమ్.. ఆ సింహాన్ని రెండోవైపు చూడబోతున్నారు.. అది కూడా అన్ స్టాపబుల్’ షో లో. ప్రతీ మనిషి జీవితంలోనూ ఎత్తుపల్లాలు ఉంటాయి. వాటిని అధిగమించి లక్ష్యాన్ని చేరడమే అన్ స్టాపబుల్.

 

ఆహా ఓటీటీలో నవంబర్ 4 నుంచి ప్రసారం కానుండ‌గా, ఈ షో జ‌నాల‌లో చాలా ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తుంది. బాల‌య్య‌తో షో చేయించాలి అంటే మాములు విష‌యం కాదు.అల్లు అర‌వింద్ డేరింగ్ స్టెప్ వేసి ఇప్పుడు బాల‌య్య‌తో అన్‌స్టాప‌బుల్ షో చేయ‌బోతున్నాడు. అన్‌స్టాప‌బుల్‌ షో కు సంబంధించిన ఈవెంట్ ను కూడా ఇటీవ‌ల‌ గ్రాండ్ గా నిర్వహించారు.

నందమూరి బాలకృష్ణ సరికొత్తగా కనిపించనున్నారు అని అర్థమవుతోంది. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ అలాగే మరొక సీనియర్ రైటర్ బివిఎస్ రవి కూడా అన్‌స్టాప‌బుల్‌ ను డైరెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక నందమూరి బాలకృష్ణ ఆ షో కోసం రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలో డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

మొదటి సారి బాలయ్య చేస్తున్న ఈ టాక్ షో కోసం ఐదు నుంచి ఆరు కోట్ల మధ్యలో తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షోకు సంబంధించిన కొన్ని ఎపిసోడ్లు అయితే షూట్ చేశారు. త్వరలోనే ప్రోమో కూడా విడుదల చేయనున్నారు. బాలకృష్ణ కూడా డిఫరెంట్ హోస్టింగ్ తో ప్రేక్షకులను సరికొత్తగా ఆకట్టుకోబోతున్నట్లు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది.

తాజాగా షూటింగ్ లొకేష‌న్‌కి సంబంధించి ప‌లు ఫొటోలు విడుద‌ల చేశారు.ఇందులో బాల‌య్య డిఫ‌రెంట్ స్టైల్‌లో క‌నిపించి సంద‌డి చేశారు. ప్ర‌స్తుతం బాల‌కృష్ణ ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తున్నాయి.