Nithin : నితిన్‌ తో స్టార్ ప్రొడ్యూసర్..!

Nithin : నితిన్ వరసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చెక్, రంగ్ దే సినిమాలతో వచ్చిన నితిన్ ప్రస్తుతం బాలీవుడ్ హిట్ సినిమా అంధాదున్ హిందీ రీమేక్ మస్ట్రో సినిమా సెట్స్ మీద ఉంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నితిన్ పియానో ప్లేయర్‌గా కనిపించబోతున్నాడు. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్రలో కనిపించబోతోంది. దాదాపు షూటింగ్ పూర్తయిందని సమాచారం.

star producer with nithin...!
star producer with nithin…!

కాగా చైతన్య కృష్ణ దర్శకత్వంలో నితిన్ పవర్ పేట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నితిన్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నట్టు సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన అధికారక ప్రకటన నటీ నటుల వివరాలు వెల్లడికానున్నాయి. అయితే నితిన్ త్వరలో మరో సినిమా ప్రకటించబోతున్నాడని న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇటీవల క్రాక్ సినిమాతో భారీ హిట్ అందుకున్న నిర్మాత ఠాగూర్ మధు ఈ సినిమాని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాడట.

Nithin : నితిన్ – వక్కంతం వంశీ కాంబోను సెట్ చేసిన క్రాక్ నిర్మాత..!

ఈ సినిమాకి ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వం వహించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి సినిమాలకి వక్కంతం వంశీ పర్మెనెంట్ రైటర్ అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెండు సినిమాలకి కథ అందిస్తున్నాడు. ఇక డెబ్యూ డైరెక్టర్‌గా అల్లు అర్జున్ తో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు రెండవ సినిమాను నితిన్ చేయబోతున్నాడని ఈ కాంబినేషన్‌ను క్రాక్ నిర్మాత ఠాగూర్ మధు సెట్ చేశాడని సమాచారం.

Advertisement