Yamini Ghantasala: తమన్ చెల్లెలు ఎంత మంచి సింగరో మీకు తెలుసా..?

Yamini Ghantasala: మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ థమన్ ప్రస్తుతం ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లలో ఒక‌రు.ఆయ‌న ప్ర‌స్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. సూపర్ హిట్ సినిమాలు అందుకుంటూ స్టార్లతో సినిమాలు చేస్తూ ముందుకు వెళుతున్నాడు.. అయితే ముందు నుంచి కూడా థమన్ పాటలు ఎక్కువగా కాపీ వివాదానికి గురవుతుంటాయి. అవేమి ప‌ట్టించుకోకుండా వ‌రుస సినిమా ఆఫ‌ర్స్ అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

త‌మ‌న్ సోద‌రి యామిని కూడా మంచి సింగ‌ర్‌. ఆమె తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో త‌న సోద‌రుడితో ఎలా ఉంటుందో తెలియ‌జేసింది. చిన్న‌ప్పుడే మా ఫాద‌ర్‌ని మేం కోల్పోయాం. అందుకే ఓ సారి తండ్రిలా, ఓ సారి ఫ్రెండ్‌లా, ఓ సారి సోద‌రుడిలా ఉంటాడు. నాకు అన్న‌య్య అయినా తండ్రి లాంటి వాడు. అన్ని నాకు అన్న‌య్య‌నే.

ఏ పాట అయిన ముందు అన్న‌య్య‌కే పంపిస్తాను. ప్ర‌తి పాట మేము వింటాం. ఈ మ‌ధ్య కాలంలో ప్ర‌తి ఆల్భమ్ చాలా హిట్ అవుతుంది. క‌ష్ట‌ప‌డ‌డం వ‌ల‌న‌నే ఇది సాధ్యం అవుతుంది. అన్న‌య్య చాలా హార్డ్ వ‌ర్క‌ర్. ఇర‌వై నాలుగు గంట‌లు ఆయ‌న వ‌ర్క్ చేస్తూనే ఉంటారు. ఆయ‌న సిస్ట‌ర్‌గా ఉండ‌డం గ‌ర్వంగా ఉంది.

ఇంత బిజీ షెడ్యూల్‌లో స‌ర‌దాగా బీచ్‌కి వెళుతుంటాం. డిన్న‌ర్ చేసిన వాల్యుబ‌ల్‌గా చేస్తాం. కెరీర్ గురించి స‌ర‌దాగా మాట్లాడుకుంటాం. ఆయ‌న కంపోజీష‌న్‌లో పాడ‌క‌పోవ‌డానికి కార‌ణం ఏమి లేదు.అంద‌రి కంపోజ‌ర్స్ ద‌గ్గ‌ర పాడి మంచి పేరు తెచ్చుకున్నాక నా ద‌గ్గ‌ర పాడుదువ్ అని అన్న‌య్య చెబుతాడు అని యామిని చెప్పుకొచ్చింది.