SS Rajamouli : వేణు మాధవ్ అసిస్టెంట్ గా రాజమౌళి పనిచేశారని మీకు తెలుసా..?
NQ Staff - June 15, 2023 / 02:24 PM IST

SS Rajamouli : వినడానికే కాస్త ఆశ్చర్యంగా ఉంది కదూ. ఎందుకంటే రాజమౌళి అంటే ఇప్పుడు ప్రపంచ స్థాయి డైరెక్టర్. హాలీవుడ్ డైరెక్టర్లను కూడా ఆయన వెనక్కు నెట్టేస్తున్నాడు. ఇండియాలోని టాప్ హీరోలు అందరూ ఆయన దర్శకత్వంలో పని చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాంటి రాజమౌళి కూడా ఒకప్పుడు సామాన్య పరిస్థితుల నుంచి వచ్చిన వాడే.
చదువును ముందుకు సాగించలేక ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఆయన మొదట్లో కథలు రాయడంలో ఆయన తండ్రికి సాయం చేసేవాడు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేశాడు. ఓ సీరియల్ కు దర్శకత్వం కూడా వహించారు. ఆ తర్వాత మెల్లిగా సినిమాలు చేయడం స్టార్ట్ చేశాడు. రెండో సినిమా నుంచే తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు.
అలాంటి రాజమౌళి ఓ సమయంలో వేణు మాధవ్ కు అసిస్టెంట్ గా పని చేశాడు. కానీ అది రియల్ లైఫ్ లో కాదండోయ్.. రీల్ లైఫ్ లో. అవును.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మూడో సినిమా సై. ఇందులో నితిన్ హీరోగా నటించాడు. కాగా ఇందులో నల్లబాలు పాత్రలో వేణు మాధవ్ నటించారు.

SS Rajamouli Seen In Small Role Sye Movie
నల్లబాలుకు అసిస్టెంట్ పాత్రలో రాజమౌళి కనిపించాడు. అది చాలా చిన్న పాత్ర. కొన్ని సెకన్ల పాటు మాత్రమే ఉంటుంది. ఆ పాత్రలో రాజమౌళి మనకు కనిపించాడు. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. రాజమౌళి ఇలా చిన్న చిన్న పాత్రల్లో బాగానే నటించాడు. ఆయనకు అన్ని విభాగాల్లో ప్రావీణ్యం ఉందనే చెప్పుకోవాలి.