Rajamouli: బాబోయ్.. జక్కన్న కి ఆర్ఆర్ఆర్ మూవీ నచ్చక మళ్ళీ రీషూట్ చేస్తున్నాడట..!?

Rajamouli ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్రెస్‌గా మారాడు. ఆయ‌న తెర‌కెక్కించిన ప్ర‌తి చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇప్ప‌టికే బాహుబ‌లి చిత్రంతో రాజ‌మౌళి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకోగా, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రంతో మ‌రో సెన్సేష‌న్ క్రియేట్ చేసేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాడు.

అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా రూపొందుతున్న‌ “ఆర్ఆర్ఆర్” చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. అజయ్ దేవ్‌గన్, అలియా భట్, ఒలివియా మోరిస్ ఇతర కీలక పాత్రలు పోషించారు. “ఆర్ఆర్ఆర్” కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ఒక కల్పిత కథ. డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

రీసెంట్‌గా చిత్రం నుండి “రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్” మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో సన్నివేశాలు, స్టంట్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చూస్తుంటే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఈ వీడియో ద్వారా ఈ సినిమా రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయ్యిందని, ఆగస్టులో సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి, అక్టోబ‌ర్ 13న సినిమాను విడుద‌ల చేయ‌నున్న‌ట్టు పేర్కొన్నారు.

అయితే చిత్రంలోని కొన్ని స‌న్నివేశాల‌ని చూసిన రాజ‌మౌళి అంత సంతృప్తి చెంద‌క‌పోవ‌డంతో రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ని మ‌ళ్లీ సెట్స్‌కి పిలిచాడ‌ట‌. వారిద్ద‌రితో రెండు మూడు రోజుల టాకీ పార్ట్ పూర్తి చేయాల‌ని జ‌క్క‌న్న భావిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌మోష‌న‌ల్ సాంగ్‌కి ముందే ప్యాచ్ వ‌ర్క్ పూర్తి చేసి ఆ త‌ర్వాత సాంగ్స్ షూట్ చేయ‌నున్నాడ‌ట‌.

RRR

ఆర్ఆర్ఆర్ ప్ర‌మోష‌న్ కోసం ఓ మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేశారట రాజ‌మౌళి. అందులో ఒకటి “ఆర్ఆర్ఆర్” ప్రమోషనల్ సాంగ్. ఈ ప్రమోషనల్ సాంగ్ లో “ఆర్ఆర్ఆర్” తారాగణం, టెక్నీకల్ సిబ్బందితో పాటు రాజమౌళితో గతంలో పని చేసినటువంటి హీరోలంతా భాగం కానున్నారట. ఈ పాటలో ప్రభాస్, రవితేజ, నాని, సునీల్, నితిన్ తదితరులు ఎన్‌టిఆర్, రామ్ చరణ్ హాజరుకానున్నారు. ఎంఎం కీరవాణి ఇప్పటికే ప్రత్యేక పాట కోసం ఒక ట్యూన్ కంపోజ్ చేశారని వార్త‌లు కూడా వ‌స్తున్నాయి.