Rajamouli: ఆర్ఆర్ఆర్ త‌ర్వాత హాలీవుడ్ మూవీ చేయ‌నున్న రాజ‌మౌళి.. ఇండియాలోనే షూటింగ్ చేయ‌నున్న‌ట్టు టాక్

Rajamouli: ఓట‌మెరుగ‌ని విక్ర‌మార్కుడు రాజ‌మౌళి వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నాడు. బాహుబ‌లి సినిమాతో ఆయ‌న కీర్తి ప్ర‌తిష్ట‌లు ప‌తాక స్థాయికిచేరుకోగా, ఇప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఆర్ఆర్ఆర్ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన ప్ర‌చార చిత్రాలు విడుద‌ల కాగా, ఇవి ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను రెట్టింపు చేశాయి. సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు క‌రోనా అడ్డుక‌ట్ట వేస్తుంది. క‌రోనా వ‌ల‌న చిత్రం ప‌లు మార్లు వాయిదా ప‌డింది. అక్టోబ‌ర్ 13న ఆర్ఆర్ఆర్ చిత్రం విడుద‌ల చేయాల‌ని మేకర్స్ భావిస్తుండ‌గా, ఇది కూడా సాధ్య‌మ‌య్యేలా క‌నిపించ‌డం లేదు.

Rajamouli

గ‌త కొద్ది రోజులుగా ఆర్ఆర్ఆర్ సినిమా త‌ర్వాత రాజ‌మౌళి చేయ‌నున్న ప్రాజెక్ట్‌లపై అనేక వార్త‌లు వ‌స్తున్నాయి. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో పీరియాడిక‌ల్ మూవీని భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా చేయ‌నున్న‌ట్టు కొన్నాళ్లుగా వార్త‌లు వినిపించాయి. తాజాగా రాజ‌మౌళి హాలీవుడ్ ప్రాజెక్ట్ చేయ‌నున్న‌ట్టు జోరుగా ప్ర‌చారం న‌డుస్తుంది.ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తయిన తర్వాత ఈ హాలీవుడ్ మూవీని లైన్లోకి తేనున్నారట. ఈ మేరకు ప్రముఖ హాలీవుడ్ సంస్థతో ఒప్పందాలు కూడా పూర్తయిన‌ట్టు కూడా తెలుస్తుంది. అయితే హాలీవుడ్ సినిమాను అమెరికాలో కాకుండా ఇండియాలోనే తెరకెక్కిస్తారట. దీనికి స్టోరీ లైన్ కూడా సిద్ధమైందట. ఈ సినిమాకు సైతం స్టోరీని రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాదే అందిస్తున్నార‌ని స‌మాచారం.

Rajamouli

ఇప్పుడు రాజ‌మౌళి సినిమాల‌కు మ‌న దేశంలోనే కాదు విదేశాల‌లోను క్రేజ్ ఉంది. ప్ర‌పంచం మొత్తం జ‌క్క‌న్న సినిమాల‌పై దృష్టి సారిస్తున్న నేప‌థ్యంలో రాజ‌మౌళి విభిన్న కథాంశాల‌తో సినిమాలు చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా త‌ర్వాత రాజ‌మౌళి మహేష్ బాబుతో సినిమా చేయ‌నున్నాడా లేదంటే హాలీవుడ్ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడా అనే దానిపై రానున్న రోజుల‌లో పూర్తి క్లారిటీ రానుంది. రాజమౌళి క‌నుక హాలీవుడ్ సినిమా తీస్తే తెలుగు సినిమా టెక్నీషియన్ హాలీవుడ్ రేంజ్ కు వెళ్లడం అనేది ఖచ్చితంగా అభినందనీయమే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మొత్తానికి బాలీవుడ్‌ని ట‌చ్ చేయ‌కుండానే డైరెక్ట్‌గా రాజ‌మౌళి హాలీవుడ్ వెళ్ల‌నున్నాడ‌న్న‌మాట‌.