SS Rajamouli And Mahesh Babu : SSMB29 : వైరల్ అవుతున్న పిక్ తో ఫ్యాన్స్ సందడి
NQ Staff - March 17, 2023 / 07:15 PM IST

SS Rajamouli And Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు త్వరలోనే పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్పీడ్ గా ఆ సినిమాను ముగించి రాజమౌళి దర్శకత్వంలో సినిమాను మహేష్ బాబు మొదలు పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.
ఇటీవల ఆస్కార్ వేడుకలో నాటు నాటు పాటతో సందడి చేసిన జక్కన్న తదుపరి సినిమా విషయంలో కాస్త గ్యాప్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ రావడంతో రాజమౌళి సినిమా అంటే ఆకాశమే హద్దు అన్నట్లుగా హాలీవుడ్ లో కూడా అంచనాలు ఉన్నాయి. కనుక వీరిద్దరి కాంబో సినిమా హాలీవుడ్ రేంజ్ మూవీ అవుతుంది అనడంలో సందేహం లేదు.
మహేష్ బాబు మరియు రాజమౌళి కాంబో మూవీకి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ రాలేదు. అయినా కూడా సోషల్ మీడియాలో రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఈ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ స్థాయిలో సినిమా యొక్క పిక్ కూడా వైరల్ అవ్వదు.
మహేష్ బాబు మరియు రాజమౌళి ఏదో విషయమై మాట్లాడుకుంటూ ఉన్నట్లుగా ఈ ఫొటోలో చూడవచ్చు. మన కాంబో సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండి నాలుగు అయిదు ఆస్కార్ అవార్డులను దక్కించుకోవాలంటూ రాజమౌళితో మహేష్ బాబు అంటున్నట్లుగా ఈ స్టిల్ ఉందని అభిమానులు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు ఈ ఫొటో ఏ సందర్భంలో తీసింది అనేది క్లారిటీ రావాల్సి ఉంది.