SS Rajamouli And James Cameron : “హాలీవుడ్ లో సినిమా చేయాలని ఉంటే నేను సిద్ధం”: రాజమౌళికి జేమ్స్ కామెరూన్ బంపర్ ఆఫర్

NQ Staff - January 21, 2023 / 02:50 PM IST

SS Rajamouli And James Cameron : “హాలీవుడ్ లో సినిమా చేయాలని ఉంటే నేను సిద్ధం”: రాజమౌళికి జేమ్స్ కామెరూన్ బంపర్ ఆఫర్

SS Rajamouli And James Cameron : జేమ్స్ కామెరూన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టైటానిక్, అవతార్ వంటి సినిమాలతో అద్భుతమైన ప్రపంచాన్ని మన కళ్ళ ముందుకి తీసుకొచ్చాడు ఈ దిగ్గజ దర్శకుడు. రీసెంట్ గా ఎస్ ఎస్ రాజమౌళి, ఎం ఎం కీరవాణిలతో జేమ్స్ కామెరూన్ సంభాషించినట్లు కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఇప్పుడు దానికి సంబంధించిన సంభాషణ అధికారికంగా ఆర్ ఆర్ ఆర్ టీమ్ విడుదల చేసింది.

రాజమౌళి: నేను మీ అన్ని సినిమాలు చూసాను, మీరు పెద్ద ఇన్స్పిరేషన్ నాకు. టెర్మినేటర్ నుండి, టైటానిక్, అవతార్, అన్నీ చూసాను. మీ దర్శకత్వశైలికి నేను పెద్ద ఫ్యాన్ ని.

జేమ్స్ కామెరూన్: మీ సినిమాలో పాత్రలు చూసాక… అదొక అద్భుతమైన ఫీలింగ్. మీ మొత్తం సెటప్ ఫైర్, వాటర్, స్టోరీ.. ఒకదాని తర్వాత ఒకటి రివీల్ చేయడం, ఆ తర్వాత బ్యాక్ స్టోరీ ఏంటో చెప్పడం, అదంతా ఒక మంచి సెటప్. తనెందుకు ఇలా చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, ట్విస్ట్ లు, స్నేహం, ఇలా అన్నీ… ఒక హీరో మరొక వ్యక్తిని ఎందుకు చంపలేడు, ఇదంతా చాలా అద్భుతం. ఇదంతా నాకు చాలా నచ్చింది.

రాజమౌళి: మీ నుండి వచ్చిన ఈ మాటలు నాకు ఇవి అవార్డుకన్నా ఎక్కువ. మీరు నా సినిమా చూసారు, దాన్ని అనలైజ్ చేస్తున్నారు అంటే నమ్మలేకపోతున్నాను.

సుజి కామెరూన్: ఒక్కసారి కాదు, రెండు సార్లు చూసారు. మొదటిసారి ఆయన ఒక్కరూ చూసారు. చూసాక నా వద్దకు వచ్చి నువ్వు ఇది కచ్చితంగా చూడాలి అని చెప్పారు. ఇక నేను చూస్తున్నప్పుడు ఆయన ఉత్సాహం ఆపుకోలేకపోయారు. ఇప్పుడు చూడు… ఇప్పుడు చూడు అంటూనే ఉన్నారు. నేను కామ్ గా ఉండు, నన్ను చూడనివ్వు అనిచెప్తున్నా.

జేమ్స్: కానీ నేనేం స్పాయిలర్ ఇవ్వలేదు.

సుజి: అవును

జేమ్స్: ఇది మొత్తం షూట్ చేయడానికి ఎంత సమయం పట్టింది?

రాజమౌళి: 320 రోజుల్లో తీసాం ఈ చిత్రాన్ని.

జేమ్స్:  నిజంగా క్రేజీగా అనిపిస్తోంది… ఇక మీరు ఈ చిత్రానికి కంపోజ్ చేసారు కదా? మిమ్మల్ని గోల్డెన్ గ్లోబ్స్ వద్ద చూసాను. బ్యాక్ గ్రౌండ్ స్కోర్,నిజంగా అద్భుతం. ఎందుకంటే నాకు సంగీతం డామినేట్ చేయడం ఇష్టముండదు. అది కేవలం సపోర్ట్ గా ఉండాలి. కానీ మీరు సంగీతాన్ని భిన్నంగా వాడారు. హీరో కళ్ళు తెరవగానే… బూమ్. అది చూడగానే లేచి నిలబడాలి అనిపించేది. నేను ఇంట్లోనే సినిమా చూసాను. కానీ నాకు చాలా సార్లు లేచి నిలబడాలి అనిపించింది.

కీరవాణి: ఇది మాకు చాలా గౌరవం.

జేమ్స్: నేను అర్ధం చేసుకోగలను. ఈ సినిమాలో చూపించిన నియంతృత్వం, భారతీయులు ఎలాంటి కష్టాలు పడ్డారు, వంటివి. ఈ ఎమోషన్ మీకు ఎక్కువ కనెక్ట్ అవుతుంది. మీ ప్రజలు ఈ చిత్రాన్ని చూసి మెచ్చుకోవడం, ఇదంతా మీకు చాలా గర్వకారణంగా అనిపించి ఉంటుంది.

రాజమౌళి: సరిగ్గా చెప్పారు. నేను అదే అంటున్నా అందరితో.

జేమ్స్: ఒక్క విషయం. హాలీవుడ్ లో సినిమా చేయాలి అని మీకు అనుకుంటే, నేను ఉన్నాను.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us