Sruthi Haasan : ఇలా బోల్డ్‌గా మాట్లాడేసిందేంటి.. అవి ధ‌రించ‌లేదంటూ కామెంట్..!

Sruthi Haasan :  చిన్న వయసులోనే గాయనిగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది శృతి హాసన్. అలాగే సొంతంగా కొన్ని పాటలు కంపోజ్ చేసింది. అప్పటి నుంచి సింగర్‌గా, ఇండిపెండెంట్ మ్యూజిక్ డైరెక్టర్‌గానూ సత్తా చాటింది. ఈ క్రమంలోనే ఎన్నో ఆల్బమ్‌లను క్రియేట్ చేసింది. ఫలితంగా ఆల్‌రౌండర్ పేరును తెచ్చుకుంది. దీంతో దేశ వ్యాప్తంగా మంచి పాపులారిటీని దక్కించుకుంది.

Sruthi Haasan chitchat with fans
Sruthi Haasan chitchat with fans

పలు విభాగాల్లో సత్తా చాటుతూ పేరు సంపాదించుకున్న కమల్ డాటర్ శృతి హాసన్.. 2000లో వచ్చిన ‘హే రామ్’ అనే చిత్రంలో చిన్న పాత్ర చేసి నటిగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. అనంతరం ‘లక్’ అనే హిందీ సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. ఇక, తెలుగులో సిద్దార్థ్ హీరోగా వచ్చిన ‘అనగనగా ఓ ధీరుడు’తో హీరోయిన్‌గా పరిచయం అయింది. ప్ర‌స్తుతం స‌లార్ అనే సినిమా చేస్తుంది.

Sruthi Haasan chitchat with fans
Sruthi Haasan chitchat with fans

తాజాగా శ్రుతీ హాసన్ తన అభిమానులతో ముచ్చట్లు పెట్టింది. ఇందులో అనేక ప్రశ్నలకు శ్రుతీ హాసన్ సమాధానం ఇచ్చింది. మీకు షాపింగ్ చేయడం, ఇంటికి కావాల్సిన గ్రాసరీస్ కొనడం ఇష్టమా? అని ఓ నెటిజన్ అడిగాడు. అవును నాకు షాపింగ్ చేయడం ఇష్టం.. నేనే సమయం దొరికినప్పుడు గ్రాసరీస్ కొంటాను.. నేను కొనడమే నాకు ఇష్టం.. వాటిని తీసుకొచ్చి నేను వండుతాను.. నాకు అది ఇష్టం అని శ్రుతీ హాసన్ తెలిపింది. టాటూల గురించి అడగ్గా.. తన ఒంటి మీదున్న వాటిని చూపించేసింది

ఇక ఈ మధ్య షూటింగ్‌లో గాయమైంది.. కదా? అది ఎలా ఉంది తగ్గిందా? అని ఇంకో నెటిజన్ అడిగాడు. పాతది కాస్త తగ్గింది..మళ్లీ ఇంకోటి కొత్తగా అయిందంటూ శ్రుతీ హాసన్ వాటిని చూపించింది. అయితే మామూలుగా మీకు బ్లాక్ అంటే ఇష్టం కదా? ఈ రోజేంటి మరి ఇలా వైట్ డ్రెస్సులో ఉన్నారు అని ఓ నెటిజిన్ అడిగాడు. అవును నేను ఈ రోజు బ్లాక్ కలర్ దుస్తులు ధరించలేదు.. నాకు ఆ కలర్ అంటేనే ఇష్టం.

కానీ నాకు వైట్ అంటే నచ్చదు..మరి ఈరోజు ఇది ఎందుకు వేసుకున్నానో నాకు కూడా అర్థం కాలేదు అని చెప్పుకొచ్చింది. శ్రుతీ హాసన్ ప్రస్తుతం ప్రభాస్ సలార్, బాలయ్య గోపీచంద్ NBK 107లో హీరోయిన్‌గా నటిస్తోంది.