Srinu Vaitla: శ్రీను వైట్ల‌కు ఫోన్ చేసి స‌మంత ఏడ్చిందా.. కార‌ణం ఏంటి?

Srinu Vaitla: అక్కినేని కోడ‌లు స‌మంత ఈ మ‌ధ్య వార్త‌ల‌లో తెగ నానుతూ వ‌స్తుంది. సినిమాలు, చైతూతో విడాకుల వ్య‌వ‌హారం, ఆమె పోస్ట్‌లు, చేసే కామెంట్స్ ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో చర్చ‌నీయాంశంగా మారాయి. స‌మంత‌కు సంబంధించి అనేక వార్త‌లు పుకార్లు న‌డుస్తున్న క్ర‌మంలో స‌మంత‌.. శీను వైట్ల‌కి కాల్ చేసి ఏడ్చిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

SrinuVaitla Told that Samantha Cried While Talking to Him
SrinuVaitla Told that Samantha Cried While Talking to Him

తాజాగా వెటరన్ డైరెక్టర్ శ్రీను వైట్ల సమంత గురించి ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్పాడు. మహేష్ సమంతలు నటించిన బ్లాక్ బస్టర్ హిట్ దూకుడు మూవీ విడుదలై నేటికి ఏడాదవుతున్న సందర్భంగా.. చిత్ర దర్శకుడు శ్రీను వైట్ల మీడియాతో ముచ్చటిస్తూ.. దూకుడు షూటింగ్ విశేషాలని చెప్పాడు. దూకుడు ఇస్తాంబుల్‌ షూటింగ్‌ గురించి మాట్లాడుతూ.. ‘ఇస్తాంబుల్‌లో ఫస్ట్‌ షెడ్యూల్‌ షూట్‌ ఎంతో సరదాగా జరిగింది.

ఆ సినిమా షూట్‌ని మేము బాగా ఎంజాయ్‌ చేశాం. ఓరోజు షూటింగ్‌ అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. దాంతో సమంత షాపింగ్‌కు వెళ్తానని అడగ్గా.. సరే అన్నాను. బయలుదేరిన పది నిమిషాలకే ఆమె నాకు ఫోన్‌ చేసి బాగా ఏడ్చేసింది. ‘ఏమైంది సమంత?’ అని అడగ్గా.. ‘ఆత్మాహుతి దాడిని కళ్లారా చూసినట్లు చెప్పింది’. అక్కడ అవన్నీ సాధారణమైన విషయాలని నచ్చజెప్పాం. కానీ సామ్‌ మాత్రం కొన్నిరోజులపాటు అదే షాక్‌లో ఉన్నారు’ అని శ్రీను వైట్ల వివరించారు.

అదే సమయంలో శ్రీను వైట్లకు కూడా ఒక అనుభవం ఎదురైందట. అతను స్టే చేసిన హోటల్ గాలికి ఊగే చెట్టులా కదలాడిందట. ఏంటిది అని ఆరా తీస్తే భూకంపం అట. భూకంపాలు ఎక్కువగా వచ్చే దేశాల్లో టర్కీ ఒకటి.