SREEMUKHI: డిప్రెష‌న్ వ‌ల‌న సూసైడ్ చేసుకోవాల‌నుకున్న శ్రీముఖి.. యాంక‌ర్ కామెంట్స్‌తో అభిమానులు షాక్

బుల్లితెర యాంక‌ర‌మ్మ‌ల‌లో త‌మ అందంతో పాటు మాట‌ల‌తో అల‌రించే వారిలో శ్రీముఖి కూడా ఒక‌రు. ఈ అమ్మ‌డు ఎప్పుడు ఎంత ఉత్సాహంగా, జోష్‌తో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం లాక్‌డౌన్ వ‌ల‌న ఇంటికే ప‌రిమిత‌మైన శ్రీముఖి అభిమానుతో ముచ్చ‌టించింది. ఓ నెటిజ‌న్.. మీరు ఎప్పుడైన డిప్రెష‌న్‌కు లోన‌య్యారా అని ప్ర‌శ్నించ‌గా, అందుకు శ్రీముఖి షాకింగ్ ఆన్స‌ర్ ఇచ్చి అంద‌రిని స‌ర్‌ప్రైజ్ చేసింది. గతంలో ఓసారి డిప్రెషన్ కు గురయ్యాను. కానీ మళ్లీ స్ట్రాంగ్ గా కంబ్యాక్ అయ్యాను. నేను కూడా డిప్రెషన్ ఫేస్ చేసాను. కానీ త్వరగా దాని నుండి బయటపడటంలో గెలవగలిగాను.డిప్రెష‌న్ స‌మ‌యంలో సూసైడ్ వ‌ర‌కు కూడా వెళ్లాను. డిప్రెషన్ గురించి సరే గాని.. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మొద‌ట మీకు మీరే ప్రేమించుకోండి ” అంటూ చెప్పుకొచ్చింది శ్రీముఖి.

Sreemukhi Black Dress Stills
Sreemukhi Black Dress Stills

బిగ్ బాస్ సీజ‌న్ 3 స‌మ‌యంలో శ్రీముఖి త‌న లవ్ బ్రేక‌ప్ గురించి చెప్పిన సంగ‌తి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 3 చివరి వారం టాస్క్ లో భాగంగా.. అప్పుడు ఒకరితో హ్యాపీ రిలేషన్ షిప్ లో ఉన్నానని.. మళ్లీ కెరీర్ కూడా చాలా ఉత్సాహంగా స్టార్ట్ అయిందని చెప్పిన శ్రీముఖి ప‌లు కార‌ణాల వ‌ల‌న ఇద్ద‌రి మ‌ధ్య తేడాలు ఏర్ప‌డ్డాయి అని పేర్కొంది. శ్రీముఖి తన ఎక్స్-బాయ్ ఫ్రెండ్ ఓ ఫేమస్ పర్సనాలిటీ అని చెప్పిన‌ప్ప‌టికీ, అత‌ని పేరు వివ‌రాలు ప్ర‌క‌టించ‌లేదు.

ప్ర‌స్తుతం ఈమె కెరీర్ ఫుల్ జోష్‌తో సాగుతుంది. కెరీర్ పరంగా శ్రీముఖి చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నట్లు.. తనపట్ల పేరెంట్స్ కూడా సంతోషంగా ఉన్నట్లు తెలిపింది ప్రపంచంలో కుటుంబ బాధ్యతలు అనేవి కేవలం మగవారి బాధ్యత మాత్రమే కాదని చెప్పుకొచ్చింది. ఇటీవలే ఉగాది జాతిరత్నాలు అనే షోలో కనిపించిన శ్రీముఖి ప్రస్తుతం బొమ్మఅదిరింది అనే షో హోస్ట్ గా వ్యవహరిస్తుంది. శ్రీముఖి ప్రస్తుతం పలు టాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తుండ‌గా, ఆమె న‌టిస్తున్న ‘క్రేజీ అంకుల్స్’ అనే మూవీ త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.