Sreemukhi: యాంక‌ర్ ప్ర‌దీప్‌కు అంద‌రి ముందు ఐల‌వ్ యూ చెప్పిన శ్రీముఖి

Sreemukhi: యాంకర్ శ్రీముఖి.. ఉరఫ్ రాములమ్మ.. ఈ పేరు వింటే బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి జోష్ వ‌స్తుంది. వెండితెర రాములమ్మ విజయశాంతి అయితే బుల్లితెర రాములమ్మ అంటే శ్రీముఖినే. టీవీ కార్యక్ర‌మాల‌తో పాటు సోష‌ల్ మీడియా ద్వారా చాలా ఇమేజ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఓ వైపు సినిమాలతో పాటు మరోవైపు రియాలిటీ షోలు కూడా చేస్తుంది శ్రీముఖి. కెరీర్ మొదట్లో చాలా పద్దతిగా.. మొహమాటంగా కనిపించిన శ్రీముఖి.. ఇప్పుడు తన విశ్వరూపం చూపిస్తుంది.

sreemukhi

మొహమాటం అనే పదం కూడా మొహమాటపడేలా రెచ్చిపోతుంది ఈ ముద్దుగుమ్మ. చిన్న సైజ్ లౌడ్ స్పీకర్ లా రెచ్చిపోతుంది శ్రీముఖి. తాజాగా ఈమె చేసిన ఓ పనికి అంతా షాక్ అయిపోయారు. కెమెరాలు చూస్తుండగానే ఓ యాంకర్ కు ఐ లవ్ యూ చెప్పి షాక్ ఇచ్చింది శ్రీముఖి. ఆయనెవరో కాదు.. ప్రదీప్ మాచిరాజు. ఈ ఇద్దరూ కెరీర్ ఒకేసారి మొదలు పెట్టారు. దాదాపు 10 ఏళ్ళ కింద ఈటీవీలో కలిసి ఓ ప్రోగ్రామ్ చేసారు ప్రదీప్, శ్రీముఖి. అప్పట్నుంచే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంది.

ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు ఇప్పటికే చాలా సార్లు సోషల్ మీడియాలోనూ వచ్చాయి. తామంత క్లోజ్ గా ఉంటాం కాబట్టే ఆ వార్తలు కూడా వస్తుంటాయి మేం పట్టించుకోం అంటూ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు ప్రదీప్, శ్రీముఖి. ఇదిలా ఉంటే తాజాగా శ్రీముఖి ఈయనకు ఐ లవ్ యూ చెప్పింది.. అది కూడా అంతా చూస్తుండగానే..! జీ తెలుగులో వచ్చే డ్రామా జూనియర్స్‌కు వచ్చిన శ్రీముఖి.. ఆ షో యాంకర్ ప్రదీప్ మాచిరాజుకు ఐ లవ్ యూ చెప్పి షాక్ ఇచ్చింది.

దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతుంది. అందులో అందాలలో అహో మహోదయం అంటూ పాటతో ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి.. ముసుగు తీసి ప్రదీప్‌కు ఐ లవ్ యూ చెప్పింది. ఆమె నోటి నుంచి ప్రపోజల్ రాగానే సిగ్గులు మొగ్గలయ్యేలా మెలికలు తిరిగిపోయాడు ప్రదీప్.

ఇదంతా చూసిన నెటిజన్స్.. వీళ్ళు నిజంగానే ప్రేమలో ఉన్నారా ఏంటి.. పెళ్లి కానీ చేసుకుంటారా.. మంచి జోడీ చేసుకుంటే బాగానే ఉంటుంది అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు. ఏదేమైనా కూడా మీడియా ముందే ఐ లవ్ యూ చెప్పడం అంటే మామూలు విషయం కాదు.. దాన్ని చేసి చూపించింది రాములమ్మ.