ప్రేమించి పెద్ద త‌ప్పు చేశాన‌ని చెప్పుకొచ్చిన శ్రీముఖి

బుల్లితెర యాంక‌ర‌మ్మ‌లో శ్రీమఖి స్టైలే వేరు. ఆమె చేసే సంద‌డి అంతా ఇంతా కాదు. రాముల‌మ్మ‌గా ఆయ‌న అభిమానుల మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర‌వేసుకుంది. సోష‌ల్ మీడియాలో శ్రీముఖి చేసే సంద‌డి అంతా ఇంతా కాదు. హాట్ హాట్ ఫొటోలు షేర్ చేయ‌డంతో పాటు నెటిజ‌న్స్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానాలు ఇస్తుంటుంది శ్రీముఖి.

sreemukhi
sreemukhi

బిగ్ బాస్ సీజ‌న్ 3లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్న శ్రీముఖి తన పర్శనల్ విషయాలను షేర్ చేసుకుంది. ఆమె బ్రేకప్ లవ్ స్టోరీని బయటపెట్టింది. చావు వరకూ వెళ్లిన తన అగ్లీ లవ్ స్టోరీని బిగ్ బాస్ హౌస్‌ నుండి రివీల్ చేసింది. నా పర్సనల్ లైఫ్ గురించి నేను ఎప్పుడూ ఓపెన్ కాలేదు. నాకు రిలేషన్ షిప్ ఉంది. కాని నా పరిస్థితి చెప్తే నా ఫేస్ అందరికీ తెలుసు కాబట్టి బయటపెట్టుకోలేదు. అతనితో నాకు అంతా ఓకే అనుకున్న సందర్భంలో సడెన్‌గా మా రిలేష‌న్‌షిప్‌లో డిస్ట్ర‌బ్ వ‌చ్చింది.

ఆ టైంలో చచ్చిపోదాం అనే పరిస్థితివరకూ వచ్చింది అంటూ తన బ్రేకప్ లవ్ స్టోరీని చెప్పుకొస్తోంది శ్రీముఖి. మరి ఈ ప్రేమకథలో విల‌న్ ఎవ‌ర‌నేది ఇప్ప‌టికీ తెలియ‌దు. తాజాగా శ్రీముఖి తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెట్టేశారు. ఇందులో నెటిజన్లు రకరకాల ప్రశ్నలను సంధించారు.

జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు ఏది అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. దానికి శ్రీముఖి సమాధానం ఇస్తూ.. జనాలను త్వరగా నమ్మడం, ప్రేమించడం అంటూ చెప్పుకొచ్చారు. ఇక జీవితంలో ప్రేమ కథలు ఉన్నాయా అని మరో నెటిజన్ అడగ‌గా, అవును ఉన్నాయ్.. అద్భుతమైనవి ఉన్నాయ్ అంటూ తెలిపింది శ్రీముఖి.

పటాస్ షోతో శ్రీముఖి రాములమ్మగా అందరినీ ఆకట్టుకోగా, ఈ అమ్మ‌డు ఈ టీవీ, జీ తెలుగు, స్టార్ మాల‌లో త‌న షోస్‌తో అల‌రిస్తుంది. శ్రీముఖి ప్ర‌స్తుతం సోషల్ మీడియాను వాడుకుంటూ తన క్రేజ్ ఏ మాత్రం తగ్గకుండా చూసుకుంటున్నారు. అప్పుడ‌ప్పుడు ఈ అమ్మ‌డు చేసే హాట్ షో నెటిజ‌న్స్ మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తుంది.